సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి | subrahmanyam for sale success tour in kakinada .. car hits fan | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి

Oct 4 2015 3:39 PM | Updated on Sep 3 2017 10:26 AM

సాయిధరమ్ తేజ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది.

కాకినాడ: సాయిధరమ్ తేజ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్దకు ఈ చిత్ర బృందం వచ్చింది. చిత్ర బృందంలోని కారు ఓ అభిమాని కాలుపై వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. అభిమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో  వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో హీరో సాయిధరమ్ తేజ, డైరక్టర్ హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యం ముందుగా ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement