breaking news
fan injured
-
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి
-
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి
కాకినాడ: సాయిధరమ్ తేజ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్దకు ఈ చిత్ర బృందం వచ్చింది. చిత్ర బృందంలోని కారు ఓ అభిమాని కాలుపై వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. అభిమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో హీరో సాయిధరమ్ తేజ, డైరక్టర్ హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్యం ముందుగా ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.