సాయిధరమ్ తేజ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్దకు ఈ చిత్ర బృందం వచ్చింది. చిత్ర బృందంలోని కారు ఓ అభిమాని కాలుపై వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. అభిమానికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు.