లాక్‌డౌన్‌.. మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

Star MAA Re Telecast Bigg Boss Telugu Season 3 - Sakshi

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్‌ చానల్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ‘స్టార్‌ మా’ కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది. 

సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మెమొరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్‌ మా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌లో ఒక ప్రకటన చేసింది. ‘21 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే మరోసారి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మెమొరీస్‌ని చూసేద్దాం’ అని పేర్కొంది. కాగా, నాగార్జున హౌస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 మూడు నెలలకు పైగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలువగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top