బీబీసీ 'వందేళ్ల సినిమా' డాక్యుమెంటరీలో రాజమౌళి! | SS Rajamouli in documentary on 100 years of Indian cinema | Sakshi
Sakshi News home page

బీబీసీ 'వందేళ్ల సినిమా' డాక్యుమెంటరీలో రాజమౌళి!

May 22 2014 1:31 PM | Updated on Jul 14 2019 4:18 PM

బీబీసీ 'వందేళ్ల సినిమా' డాక్యుమెంటరీలో రాజమౌళి! - Sakshi

బీబీసీ 'వందేళ్ల సినిమా' డాక్యుమెంటరీలో రాజమౌళి!

వందేళ్ల భారతీయ సినిమాపై బీబీసీకి చెందిన సంజీవ్ భాస్కర్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కనిపించనున్నారు.

చెన్నై: వందేళ్ల భారతీయ సినిమాపై బీబీసీకి చెందిన సంజీవ్ భాస్కర్ రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కనిపించనున్నారు. . ఈ డాక్యుమెంటరీలో బాహుబలి చిత్రంలో నటిస్తున్న కొంతమంది నటులు కూడా డాక్యుమెంటరీలో పాలుపంచుకున్నారు. సంజీవ్ భాస్కర్ ను కలుసుకోవడం గొప్ప అనుభూతిని కలిగించింది. బాహుబలిలో నటిస్తున్న రానా, ఇతర నటీనటులను ఇంటర్వ్యూ చేశారు. అని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో రాజమౌళి పోస్ట్ చేశారు. 
 
బీబీసీ కి చెందిన సంజీవ్ భాస్కర్ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలను రికార్డు చేశారు. రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి చిత్రం గురించి సంజీవ్ ఆసక్తిగా తెలుసుకున్నట్టు తెలిసింది. 2015లో విడుదలయ్యే బాహుబలిలో ప్రభాస్, రానా, అనుష్క, సుదీప్, నాజర్, ప్రకాశ్ రాజ్ లు నటిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement