అది అతి పెద్ద యజ్ఞం | Sakshi
Sakshi News home page

అది అతి పెద్ద యజ్ఞం

Published Thu, Sep 21 2017 12:31 AM

అది అతి పెద్ద యజ్ఞం

 – విజయేంద్రప్రసాద్‌

ప్రస్తుత రోజుల్లో కొత్తవారితో సినిమా తీసి రిలీజ్‌ చేయడమే నా దృష్టిలో అతి పెద్ద యజ్ఞం. ఆ పనిని మా నిర్మాతలు విజయవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా నాలాంటి తిక్కవాడితో సినిమా తీసి సక్సెస్‌ అయ్యారు’’ అని ప్రముఖ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్‌ అన్నారు. రజత్, నేహాహింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.

విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శ్రీవల్లీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్‌ ఫేస్‌లో నెగటివ్‌ షేడ్స్‌ చూసి ఈ సినిమాలో హీరోగా అవకాశామిచ్చాను. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు చాలా మంది విలన్‌గా మొదలై, గొప్ప నటులయ్యారు. వారి తరహాలోనే రజత్‌ అడుగులు వేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్ర విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపింది’’ అన్నారు నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement