శీనుతో శ్రీవల్లి | Srinu tho Srivalli | Sakshi
Sakshi News home page

శీనుతో శ్రీవల్లి

Jun 5 2014 11:29 PM | Updated on Sep 2 2017 8:21 AM

నాలుగు జంటల నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘శీనుతో శ్రీవల్లి’. శ్రీనివాస యాదవ్ దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబీ ఈషా రామ ప్రియ సమర్పణలో ఆడిమోని మల్లికార్జున

నాలుగు జంటల నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘శీనుతో శ్రీవల్లి’. శ్రీనివాస యాదవ్ దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బేబీ ఈషా రామ ప్రియ సమర్పణలో ఆడిమోని మల్లికార్జున యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే ప్రేమకథ ఇది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరున గుంటూరులో ప్రారంభోత్సవం జరిపి, గుంటూరు, తెనాలి, భట్టిప్రోలు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. గతంలో ‘ఫ్రెండ్స్ కాలనీ’ డెరైక్ట్ చేశానని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శేషభట్టర్ వెంకటరమణ, పాటలు: బీఎన్ నాయుడు, సంగీతం: థామ్సన్ మార్టిన్.
 

Advertisement
 
Advertisement
Advertisement