అందం... ఆనందం | 'Srimanthudu' Teaser Releases as Birthday Gift to Krishna: Mahesh Babu's Looks | Sakshi
Sakshi News home page

అందం... ఆనందం

May 31 2015 11:43 PM | Updated on Sep 3 2017 3:01 AM

అందం... ఆనందం

అందం... ఆనందం

మహేశ్‌బాబు... ఒకప్పుడు యూత్‌లో యమా ఫాలోయింగ్. కట్ చేస్తే.. ఫ్యామిలీస్‌కి కూడా ఇష్టమైన హీరో అయిపోయారు.

 మహేశ్‌బాబు... ఒకప్పుడు యూత్‌లో యమా ఫాలోయింగ్. కట్ చేస్తే.. ఫ్యామిలీస్‌కి కూడా ఇష్టమైన హీరో అయిపోయారు. చాక్లెట్ బోయ్... మాస్ హీరో... ఫ్యామిలీ హీరో.. మహేశ్‌ని ఇలా ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయలేం. ఆయన ‘ఆల్ రౌండర్’. ఇంకా చెప్పాలంటే, సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా పరిశ్రమకు వచ్చి, ‘మహేశ్‌బాబు తండ్రి కృష్ణ’ అనిపించుకున్నారు. ఇది ఏ తండ్రికైనా ఆనందంగానే ఉంటుంది. కథానాయకునిగా ఇప్పటికి దాదాపు 20 చిత్రాల ద్వారా అలరించిన మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
 
  ఆదివారం కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మహేశ్ తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ని ప్రారంభించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో  పీవీపీ సినిమా పతాకంపై పెరల్.వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు పెరల్ వి. పొట్లూరి, పరమ్. వి.పొట్లూరి కెమెరా స్విచ్చాన్ చేసి, క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘ఎక్కడైనా ఓ నలుగురు ఉన్న చోట అందం, ఆనందం ఉంటాయి. అలాంటిది అనేక మంది ఓ కుటుంబంలో ఉండి  ప్రతి సందర్భాన్నీ ఓ ఉత్సవంలా జరుపుకుంటే.. అదే ఈ ‘బ్రహ్మోత్సవం’.
 
  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేశ్‌తో మంచి సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.  ‘‘జూలై 10 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. సత్యరాజ్, జయసుధ, తనికెళ్ల భరణి, రావు రమేశ్ తదిత రులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఆర్ట్: తోట తరణి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement