మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు | Srimanthudu audio release on July 18 | Sakshi
Sakshi News home page

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు

Jul 9 2015 11:48 PM | Updated on Jul 12 2019 4:40 PM

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు - Sakshi

మరో వారంలో ‘శ్రీమంతుడు’ పాటలు

మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’గా సిద్ధమవుతున్నారు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్,

మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’గా సిద్ధమవుతున్నారు. ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది.  ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లకి మంచి స్పందన లభించింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆడియో వేడుకపై ఉంది. ఈ నెల 18న ఈ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన  ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ - ‘‘దేవిశ్రీప్రసాద్‌కు ఇది 51వ సినిమా. ఆయన గత సినిమాల తరహాలోనే ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ అందించారు. కచ్చితంగా మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement