జాన్వీ బాటలోనే ఖుషీ కూడా..!

Sridevi Daughter Khushi kapoor Aiming To Become A Heroine - Sakshi

ముంబై : దివంగత నటి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ‘ధడక్‌’  సినిమాతో హీరోయిన్‌గా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో జాన్వీ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. తల్లి లాగే జాన్వీ కూడా కళ్లతోనే భావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త శ్రీదేవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సినిమాల్లోకి రానుందనేదే ఈ వార్తల సారాంశం.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్‌ తెలిపారు. ‘ఖుషీ మొదట మోడల్‌ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్‌ కావాలనుకుంటోంది. కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్‌, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని’  బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top