డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ | Sakshi
Sakshi News home page

డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌

Published Mon, Jun 8 2020 3:30 AM

Sreenu Vaitla finally commencing Dhee sequel Movie - Sakshi

మంచు విష్ణుని డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారట శ్రీను వైట్ల. 13 ఏళ్ల క్రితం విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ మూవీ ‘ఢీ’ గుర్తుండే ఉంటుంది. అందులో ఉన్న ‘నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు’ డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు ‘ఢీ’కి సీక్వెల్‌ చేయడానికి విష్ణు–శ్రీను వైట్ల రెడీ అవుతున్నారని టాక్‌. కథ కూడా రెడీ అయిందట. ‘ఢీ2’ (డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌) టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో ఫస్ట్‌ పార్ట్‌ కన్నా మరింత కామెడీతో పాటు ఫుల్‌ యాక్షన్‌ కూడా ఉంటుందని తెలిసింది. ఇందులో విష్ణు హీరోగా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారట. ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ మొదలుపెట్టాలను కుంటున్నారని తెలిసింది.

Advertisement
Advertisement