ఇళయరాజా సంగీతం.. ఎస్పీబీ గాత్రం | SP Balasubrahmanyam Song In ILayaraja Music Direction For Tamilarasan | Sakshi
Sakshi News home page

ఇళయరాజా సంగీతం.. ఎస్పీబీ గాత్రం

Jun 1 2019 3:11 PM | Updated on Jun 1 2019 3:14 PM

SP Balasubrahmanyam Song In ILayaraja Music Direction For Tamilarasan - Sakshi

ఇళయరాజా సంగీతంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో అధ్బుతమైన పాటలను పాడారు. ఆ పాటలన్నీ ఎప్పటికీ నిలిచిపోతాయి. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఇళయరాజా-ఎస్పీబీ ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే గతంలో ఇళయరాజా తన పాటలకు రాయల్టి ఇవ్వాలని, అలా అయితేనే తన పాటలను వేదికలపై పాడాలని రచ్చ చేశారు. ఆ వివాదం తరువాత వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది.

అయితే తాజాగా వీరిద్దరు మళ్లీ కలిశారని, ఒకే వేదికపై కలవనున్నారని అంతేకాకుండా లైవ్‌ కాన్సెర్ట్‌లో బాలు పాడతారని తెలిపారు. అయితే తాజాగా ఇళయరాజా మ్యూజిక్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ‘తమిళసరన్‌’( ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని హీరో) అనే చిత్రంలో బాలు ఓ పాటను కూడా పాడుతున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన కంపోజిషన్‌ జరుగుతుండగా.. తీసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement