సితార క్లాసికల్‌ డ్యాన్స్‌.. నమ్రత సైక్లింగ్‌

Sitara Doing Classical Dance Practice While Vacation in Paris - Sakshi

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లలో మిస్సవుతున్న వినోదాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ సెలబ్రెటీలు. ఈ జాబితాలో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే నమ్రతా శిరోద్కర్‌.. మహేశ్‌, గౌతమ్‌, సితారలకు సంబంధించిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా త్రో బ్యాక్‌(పాత) ఫోటో, వీడియోలను సైతం షేర్‌ చేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.  (రాజమౌళితో మహేశ్‌ సినిమా ఆశించొచ్చా?)

తాజాగా తన ముద్దుల కూతురు సితార పారిస్‌ హోటల్‌లో క్లాసికల్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. సెలవుల్లో కూడా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ ఆపలేదని కామెంట్‌ జతచేశారు. దీనినే అంకితభావం అని అంటారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక జర్మనీ వీధుల్లో గౌతమ్‌, సితారలతో కలిసి సైక్లింగ్‌ చేస్తున్న మరో త్రో బ్యాక్‌ వీడియోను కూడా నమ్రతా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పాత వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే పరుశురామ్‌ దర్వకత్వంలో ‘సర్కారు వారి పాట’ రూపొందుతున్న విషయం తెలిసిందే.  (మహేశ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top