రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగర్‌ సునీత | Singer Sunitha Gives Clarity On Marriage Rumours | Sakshi
Sakshi News home page

Jul 19 2018 9:53 PM | Updated on Jul 20 2018 6:57 AM

Singer Sunitha Gives Clarity On Marriage Rumours - Sakshi

గాయని సునీత

‘చాలా సంతోషం . నా మేలు కోరి,  నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కానీ, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.

సాక్షి, హైదరాబాద్‌: సుమధుర గానంతో తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గాయని సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు గురువారం సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. ఈ వార్తపై ఆమె స్పందించారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలో ఆమె స్పష్టం చేశారు. ‘మీ అందరి ఆదరణవల్లే ఇంకా పాటలు పాడుతూ.. హాయిగా ఉన్నాను. కానీ, అనుకోకుండా ఒక వార్త నన్ను కలవర పెట్టింద’ని అన్నారు. దయచేసి రూమర్లను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మధ్యాహ్నం వార్తలు ప్రసారం అయ్యాయనీ, వెంటనే వందల కొద్దీ ఫోన్ల వరద మొదలైందని అన్నారు. ‘చాలా సంతోషం . నా మేలు కోరి,  నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. కానీ, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఉంటే తప్పకుండా చెప్తాన’ని అన్నారు. దయచేసి వదంతులను ప్రసారం చేయొద్దని మీడియాను కోరారు.

కాగా, చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ‘సునీత ఉపద్రష్ట’.. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా 750కిపైగా చిత్రాలకు పని చేశారు. 19 ఏళ్ల వయసులోనే కిరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement