దీని వెనుక పెద్ద కుట్ర ఉంది: సింగర్‌ సుచిత్ర

Singer Suchitra Clarity Over Her Sister Files Complaint On Her Missing - Sakshi

‘సుచీ లీక్స్‌’తో కోలీవుడ్‌లో దుమారం రేపిన సింగర్‌ సుచిత్ర(సారొస్తారా సాంగ్‌ ఫేం) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంతవాళ్లే తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే తనను క్లినిక్‌లో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుచిత్ర కనిపించడం లేదంటూ ఆమె సోదరి సునీత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిగారింటి నుంచి తన నివాసానికి వచ్చే క్రమంలో ఆమె మిస్సయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుచిత్ర మానసిక వైకల్యంతో బాధపడుతోందని.. అందుకే త్వరగా తన జాడను కనిపెట్టాలని పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు సుచిత్ర ఓ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చినందు వల్లే సుచిత్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని.. ప్రస్తుతం ఆమెను తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.

కాగా ఈ విషయంపై స్పందించిన సుచిత్ర ఓ వెబ్‌సైట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నేను మిస్సవ్వలేదు. కొన్ని గంటలపాటు వారితో కాంటాక్ట్‌లో లేనందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడేమో నాకు పిచ్చి పట్టిందన్నట్లుగా ఓ క్లినిక్‌లో చేర్పించారు. సునీత, ఆమె భర్త బయట నాకోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర దాగున్నట్లు అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు. కాగా కోలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలను సుచీ లీక్స్‌ పేరిట 2017లో సుచిత్ర తన ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర దుమారం రేగడంతో తన భార్య ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందంటూ సుచిత్ర భర్త కార్తిక్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు. ఇక తదనంతర కాలంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top