చోరికి గురైన సింగర్‌ చిన్మయి కారు | Singer chinmayi car robbed in Sanfrancisco | Sakshi
Sakshi News home page

చోరికి గురైన సింగర్‌ చిన్మయి కారు

Published Tue, May 9 2017 9:08 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

చోరికి గురైన సింగర్‌ చిన్మయి కారు - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: మ్యూజిక్‌ టూర్‌కు వెళ్లిన సింగర్‌ చిన్మయి శ్రీ పాదకు చేదు అనుభవం ఎదురైంది. పార్క్‌ చేసిన ఉన్న ఆమె కారును పగులగొట్టిన దుండగులు కొన్ని వస్తువులను దొంగిలించారట. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్‌ ద్వారా తెలిపారు. కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందన్నారు.

కారు పార్కు చేసిన ప్రాంతంలో దొంగతనాలు సాధారణమేనని శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసులు చెప్పనట్లు తెలిపారు. చోరీ జరుగుతుండగా చూసి కేకలు పెట్టిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. భూమి మీద ఇంకా కొందరు మంచివాళ్లు ఉన్నారని అన్నారు. దొంగతనానికి గురైన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement