అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే! | Shruti Hassan top heroine in tollywood | Sakshi
Sakshi News home page

అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే!

Jun 24 2014 3:39 AM | Updated on Aug 28 2018 4:30 PM

అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే! - Sakshi

అందరూ ఇష్టపడుతున్నది ఆమెనే!

శ్రుతీహాసన్ తన తోటి కథానాయికలందరికీ షాక్ ఇచ్చారు. ‘దక్షిణాదిన అందరూ అత్యంత ఇష్టపడుతున్న హీరోయిన్ ఎవరు?’ అనే అంశంపై ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన

శ్రుతీహాసన్ తన తోటి కథానాయికలందరికీ షాక్ ఇచ్చారు. ‘దక్షిణాదిన అందరూ అత్యంత ఇష్టపడుతున్న హీరోయిన్ ఎవరు?’ అనే అంశంపై ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందర్నీ వెనక్కు నెట్టి ఆమె మొదటి స్థానంలో నిలిచారు. బళ్లు ఓడలు అవ్వడం... అంటే ఇదే. గతంలో శ్రుతీహాసన్ పేరెత్తితే చాలు ‘ఐరన్‌లెగ్’ అనేవారు. అలాంటి హీరోయిన్ ఇలాంటి క్రెడిట్ సాధించడం నిజంగా విశేషమే. గబ్బర్‌సింగ్, ఎవడు, బలుపు, రేసుగుర్రం... ఇలా వరుసగా విజయాలను అందుకుంటూ తెలుగు సినీరంగంలో దూసుకుపోతున్నారు శ్రుతి.

నిజానికి, గత ఏడాది ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో 11వ స్థానంలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇప్పుడిలా ప్రేక్షకాదరణలో ప్రథమ స్థానం పొందడాన్ని బట్టి... శ్రుతి కెరీర్ స్పీడ్ ఏ రేంజ్‌లో ఉందో ఊహించుకోవచ్చు. పెద్దగా విజయాలు లేకపోయినా తమన్నా ఈ సర్వేలో రెండోస్థానంలో నిలవడం విశేషం. శ్రీయ, ఇలియానా, హన్సిక, నయనతార, కాజల్ టాప్ టెన్‌లో స్థానం సంపాదించుకోగా, ప్రస్తుతం తెలుగులో నంబర్‌వన్ హీరోయిన్‌గా భాసిల్లుతున్న సమంత 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ సర్వేలో నంబర్‌వన్‌గా నిలిచినందుకు శ్రుతి చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement