చెన్నై కాలింగ్‌! | shruti haasan on Twitter: "Tacos tacos tacos | Sakshi
Sakshi News home page

చెన్నై కాలింగ్‌!

Nov 25 2017 1:09 AM | Updated on Nov 25 2017 1:09 AM

shruti haasan on Twitter: "Tacos tacos tacos  - Sakshi

మేడమ్‌గారు ఈ మధ్య ముంబయ్‌లో తక్కువ, లండన్‌లో ఎక్కువ ఉంటున్నారులెండి! అప్పుడెప్పుడో ఓసారి మేఖైల్‌ కోర్సలే అనే లండన్‌ బేస్డ్‌ యాక్టర్‌తో శ్రుతి హాసన్‌ డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలొచ్చాయి. మరి, ఆ వార్త నిజమో లేక చేతిలో సినిమాలేవీ లేవని సరదాగా షికార్లు చేస్తున్నారో! చాలా రోజులుగా శ్రుతి లండన్‌లోనే ఉంటున్నారనేది హండ్రెడ్‌ పర్సెంట్‌ ట్రూత్‌.

లండన్‌లో... ‘ట్రైన్‌లో తిరిగాను, టాకోస్‌ తిన్నాను, కొత్త కీ–బోర్డు కొన్నాను’ అని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చే ఈ బ్యూటీ, నిన్న చెన్నై వస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే... ‘చెన్నై కాలింగ్‌! ఇంటికి వెళ్లాలి, ఫ్యామిలీని కలవాలి, వర్క్‌ ఉంది’ అని పేర్కొన్నారు. బహుశా... కొంతకాలంగా ఆఫీసుకి పరిమితమైన ‘శభాష్‌ నాయుడు’ కథకి, షూటింగ్‌ చేసిన కొంత భాగానికి శ్రుతి తండ్రి కమల్‌ హాసన్‌ బూజులు ఏమైనా దులిపి మళ్లీ పట్టాలు ఎక్కిస్తారంటారా? లేదంటే... కొత్త సిన్మా చాన్స్‌ ఏదైనా వచ్చుండొచ్చు కూడా!!

Advertisement
 
Advertisement
Advertisement