హలో హాలీవుడ్‌ | Shruti Haasan To Star In The American TV Series Treadstone | Sakshi
Sakshi News home page

హలో హాలీవుడ్‌

Jun 21 2019 12:31 AM | Updated on Jun 21 2019 12:31 AM

Shruti Haasan To Star In The American TV Series Treadstone - Sakshi

శ్రుతీహాసన్‌

గతంలో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేశారు శ్రుతీహాసన్‌. లండన్‌లో కొన్ని మ్యూజిక్‌ షోలు నిర్వహించారు. యాక్టింగ్‌కు ఇచ్చిన విరామానికి  ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ యాక్టింగ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా, తెలుగులో రవితేజతో ఓ సినిమా అంగీకరించారు శ్రుతీహాసన్‌. తాజాగా ఓ ఇంటర్నేషనల్‌ టీవీ సిరీస్‌లోనూ నటిస్తున్నారని తెలిసింది. హాలీవుడ్‌లో ‘బోర్న్‌’ సిరీస్‌లో 5 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాల తరహాలోనే ‘ట్రెడ్‌ స్టోన్‌’ అనే సిరీస్‌ను రూపొందిస్తున్నారు. మైఖేల్‌ ఫోర్బ్స్, మైఖేల్‌ గ్యాస్టన్, బ్రైన్‌ జె. స్మిత్‌ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

ఇటీవలే బుడాపెస్ట్‌లో ఈ సిరీస్‌ ప్రీ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ అయింది. ఇంటర్నేషనల్‌ స్పై మిషన్‌ కథాంశంగా రూపొందనున్న ఈ సిరీస్‌లో శ్రుతీహాసన్‌ ఢిల్లీకి చెందిన నీరా పటేల్‌ పాత్రలో కనిపిస్తారు. పగలంతా హోటల్‌లో వెయిట్రెస్‌గా కనిపించి రాత్రి హత్యలు చేసే కిల్లర్‌గా మారతారట. త్వరలోనే ఈ సిరీస్‌ షూటింగ్‌లో శ్రుతీహాసన్‌ పాల్గొననున్నారు. యూఎస్‌ టీవీ సిరీస్‌లో నటించనున్న తొలి సౌతిండియన్‌ హీరోయిన్‌ కూడా శ్రుతీహాసనే కావడం విశేషం. ఇంతకుముందు ‘క్వాంటికో’ అనే టీవీ సిరీస్‌లో ఉత్తరాది భామ ప్రియాంకా చోప్రా కనిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement