
ఇటీవల శ్రుతీహాసన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను గమనిస్తుంటే ఆల్మోస్ట్ ప్రతి ఫొటోలోనూ లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెలే ఉన్నారు. శ్రుతీ, మైఖేల్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే శ్రుతి మాత్రం మైఖేల్‌ను లవర్ అని ఒప్పుకోవడం లేదు కానీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అంటున్నారు. తాజాగా ‘వైఫై కన్నా ఎక్కువగా నేను మైఖేల్‌ను ప్రేమిస్తున్నాను’’ అని అర్థం వచ్చేలా ఓ ఫొటోను ఉంచారు శ్రుతి.
ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో వైఫై కనెక్షన్ లేకపోతే నెటిజన్లు ఎంతలా అల్లాడిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మైఖేల్ లేకపోతే శ్రుతి కూడా అంతేనేమో. అందుకే ఆ పోస్ట్ పెట్టారేమో? అని విశ్లేషించుకుంటున్నారు నెటిజన్లు. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విద్యుత్ జమాల్ సరసన బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ ఈ సినిమాకు దర్శకుడు.