మెట్రో రైలెక్కిన శ్రుతిహాసన్ | Shruti Haasan 'impressed' by Mumbai Metro | Sakshi
Sakshi News home page

మెట్రో రైలెక్కిన శ్రుతిహాసన్

Apr 30 2015 5:23 PM | Updated on Sep 3 2017 1:10 AM

మెట్రో రైలెక్కిన శ్రుతిహాసన్

మెట్రో రైలెక్కిన శ్రుతిహాసన్

పుడుతూనే నోట్లో బంగారు స్పూన్తో పుట్టిన అమ్మాయి.. శ్రుతిహాసన్. అలాంటి శ్రుతి.. ముంబై నగరంలో మెట్రో రైలు ఎక్కి తిరిగింది.

పుడుతూనే నోట్లో బంగారు స్పూన్తో పుట్టిన అమ్మాయి.. శ్రుతిహాసన్. అప్పటికే విశ్వవిఖ్యాత నటుడైన కమల్హాసన్ కూతురిగా ఆమెకు అందుబాటులో లేని సౌకర్యాలంటూ ఏమీ లేవు. దానికి తోడు ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఆమె సొంత సంపాదన కూడా చాలానే ఉంటోంది. ఏసీ కార్లు ఒకటి కాదు.. రెండు మూడైనా సమకూర్చుకోగలదు. కానీ అలాంటి శ్రుతి.. ముంబై నగరంలో మెట్రో రైలు ఎక్కి తిరిగింది. ముంబై మహానగరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఘోరంగా ఉంటుందని, దాన్నుంచి తప్పించుకోడానికి ఆమె మెట్రో రైలు ఎక్కింది.. ఆ ప్రయాణం చాలా బాగుందని గురువారం ట్వీట్ చేసింది. తాజాగా శ్రుతిహాసన్ నవరతన్ కూల్ టాల్కం పౌడర్ ప్రకటనలో కూడా పాల్గొంది. ఆ ఫొటోను ఆమె రీట్వీట్ చేసింది.

ప్రస్తుతం శ్రుతిహాసన్ 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమా చేసింది. అందులో అక్షయ్ కుమార్ సరసన నటించింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మించారు. 2002లో విడుదలైన రమణ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement