ద్రౌపదిగా వినిపిస్తా! | Shilpa Shetty will narrate the Mahabharata as Draupadi on radio | Sakshi
Sakshi News home page

ద్రౌపదిగా వినిపిస్తా!

Aug 25 2018 2:15 AM | Updated on Aug 25 2018 2:15 AM

Shilpa Shetty will narrate the Mahabharata as Draupadi on radio - Sakshi

శిల్పాశెట్టి

మహాభారతంలో ద్రౌపది పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పాత్రలో వినిపించడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్‌ కథానాయిక శిల్పాశెట్టి. వావ్‌.. మరి ఈ సినిమాకి డైరెక్టర్‌ ఎవరు? పాండవులుగా నటించేదెవరు? కౌరవుల మెయిన్‌ టీమ్‌ కౌన్‌? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్‌లోకి వస్తే వెంటనే ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఎందుకంటే.. ఇది సినిమానో, టీవీ సీరియలో, వెబ్‌ సిరీసో కాదు. రేడియోలో ‘మహాభారతం’ వినబోతున్నాం. ఇందులో ద్రౌపది పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు శిల్పా శెట్టి. ‘‘నాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. చిన్నప్పుడు బీఆర్‌ చోప్రా మహాభారతం మాత్రమే టీవీలో చూసే చాన్స్‌ ఉండేది. అందులో ద్రౌపది పాత్ర చాలా బాగుంటుంది. ఈ పాత్రకు వాయిస్‌ అందిచ బోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శిల్పా. వెండితెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. అలాగే బుల్లితెరపై కూడా సత్తా చాటారు శిల్పా. ఇప్పుడు రేడియో ప్లాట్‌ఫామ్‌లోకి ద్రౌపది పాత్రతో ఫస్ట్‌ టైమ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఆప్నే’ సినిమా తర్వాత శిల్పాశెట్టి మరో ఫుల్‌ లెంగ్త్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.

Advertisement
 
Advertisement
Advertisement