మా ఆయన మళ్లీ ప్రేమలో పడ్డాడనుకున్నా! | Shilpa Shetty suspected her husband | Sakshi
Sakshi News home page

మా ఆయన మళ్లీ ప్రేమలో పడ్డాడనుకున్నా!

Oct 27 2013 1:17 AM | Updated on Apr 3 2019 6:23 PM

రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఓ బాబు ఉన్నాడు. పేరు ‘వియాన్’. ఆ బాబు ఆలనాపాలనా,

రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ఓ బాబు ఉన్నాడు. పేరు ‘వియాన్’. ఆ బాబు ఆలనాపాలనా, భర్త చేసే వ్యాపారాలకు చేదోడు వాదోడుగా ఉండటంతోనే తన పని అయిపోతుందని అంటున్నారు శిల్పా. అందుకే ప్రస్తుతం నటిగా కొనసాగడంకన్నా నిర్మాణం చాలా సులువు అని కూడా పేర్కొన్నారామె. ఎందుకంటే, నటన అంటే కెమెరా ముందు నేనే చెయ్యాలి. అదే ప్రొడక్షన్ అనుకోండి, ఓ సీఈవోని అపాయింట్ చేసుకుని, అన్ని బాధత్యలూ అతనికి అప్పజెప్పేసి, పర్యవేక్షిస్తే చాలని శిల్పా స్పష్టం చేశారు. 
 
 ఇదిలా ఉంటే... ఆల్రెడీ తనను ప్రేమించి, పెళ్లి చేసుకున్న రాజ్ మరోసారి మరో అమ్మాయితో ప్రేమలో పడ్డారేమోనని శిల్పాకి సందేహం వచ్చిందట. దాని గురించి ఆమె చెబుతూ -‘‘ఈ మధ్యకాలంలో రాజ్ ఎప్పుడు చూసినా ఫోన్లతో బిజీగా ఉండటం గమనించాను. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతుండటంతో ఎవరితో అయినా ఎఫైర్ పెట్టుకున్నాడేమో అనిపించింది. కానీ, రాజ్ మాట్లాడుతున్నది తన కో-రైటర్ ఆర్యతో అని ఆ తర్వాత తెలిసింది. ‘హౌ నాట్ టు మేక్ మనీ’ అని ఆయన ఓ పుస్తకం రాశారు.
 
అందుకే నేను కూడా డైట్ గురించి లేక ఫిట్‌నెస్ మీద ఓ పుస్తకం రాయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. తను రాసిన పుస్తకం ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం నిర్మించాలనే ఆలోచన రాజ్‌కి ఉందట. దాని గురించి శిల్పా చెబుతూ - ‘‘రాజ్ సార్ధకనామధేయుడు. తన పేరుకి తగ్గట్టుగా ఆలోచనలన్నీ భారీగానే ఉంటాయి. అందుకని, ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించి తీరతాడనే నమ్మకం నాకుంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement