రీషూట్‌లో ‘పడి పడి లేచే మనసు’! | Sharwanand Sai Pallavi Padi Padi Leche Manasu Reshoot | Sakshi
Sakshi News home page

Nov 20 2018 12:33 PM | Updated on Nov 20 2018 2:22 PM

Sharwanand Sai Pallavi Padi Padi Leche Manasu Reshoot - Sakshi

శర్వానంద్‌, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్‌లో రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సంతృప్తిగా లేని చిత్రయూనిట్ రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రీషూట్‌కు డేట్స్‌ కేటాయించేందుకు సాయి పల్లవి అదనపు పారితోషికం అడుగుతున్నారట. నిర్మాతలు కూడా ఎక్స్‌ట్రా పేమెంట్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్న టాక్‌ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement