శర్వానంద్ కొత్త సినిమాకు ‘శ్రీకారం’ | Sharwanand New Film Sreekaram Launched | Sakshi
Sakshi News home page

శర్వానంద్ కొత్త సినిమాకు ‘శ్రీకారం’

Jun 30 2019 11:56 AM | Updated on Jun 30 2019 11:56 AM

Sharwanand New Film Sreekaram Launched - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణరంగం పనుల్లో బిజీగా ఉన్న శర్వా, త్వరలో 96 రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల స్కైడైవింగ్ ప్రాక్టీస్‌లో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈ యంగ్‌ హీరో తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాడు.

96 రీమేక్‌తో పాటు కిశోర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న శ్రీకారం సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుకుమార్‌, శశికాంత్‌ వల్లూరి, బుర్రా సాయి మాధవ్‌లు ముఖ్య అతిథిలుగా హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమా 2020 సంక్రాంతి రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement