సిన్సియర్‌ పోలీసాఫీసర్‌...

shakalaka shankar new movie nalugo simham - Sakshi

తెలుగులో మంచి పేరు సంపాదించిన స్టార్‌ కమెడియన్లలో షకలక శంకర్‌ ఒకరు. అతి తక్కువ కాలంలోనే కమెడియన్‌గా పేరు సంపాదించిన శంకర్‌ హీరోగా మారి, సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘నాలుగో సింహం’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గతంలో  సాయికుమార్‌ హీరోగా నటించిన ‘పోలీస్‌ స్టోరీ’లో ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్‌..’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు షకలక శంకర్‌ పవర్‌ఫుల్‌ నాలుగో సింహంగా నటిస్తున్నారు.

ఆర్‌.ఏ. ఆర్ట్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది. శంకర్‌ సరసన అక్షయ్‌ శెట్టి నటిస్తోంది.  ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాలు.. వాటిని చూసీ చూడనట్లుగా ఉండే అవినీతి అధికారుల నిర్వాకాలపై నిప్పులు చెరుగుతూ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందీ ఈ చిత్రం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: శ్రవణ్‌ కుమార్, సంగీతం: అజయ్‌ పట్నాయక్, ఫైట్స్‌: దేవరాజ్, ఎడిటింగ్‌: శ్రీ, కథ–స్క్రీన్‌ ప్లే–నిర్మాణం–దర్శకత్వం: జానీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top