‘కబీర్‌ సింగ్‌’ ట్రైలర్‌.. షాహిద్‌ చించేశాడు! | Shahid Kapoor Kabir Singh Trailer Out | Sakshi
Sakshi News home page

‘కబీర్‌ సింగ్‌’ ట్రైలర్‌.. షాహిద్‌ చించేశాడు!

May 13 2019 2:31 PM | Updated on May 13 2019 2:33 PM

Shahid Kapoor Kabir Singh Trailer Out - Sakshi

‘అర్జున్‌ రెడ్డి’గా విజయ్‌ దేవరకొండ నటనకు టాలీవుడ్‌ ఫిదా అయిన సంగతి తెలిసిందే. తన నటనతో సినిమాను ఓ క్లాసిక్‌గా నిలబెట్టేశాడు. విజయ్‌ ఎంతో ఇంటెన్సిటితో నటించిన ఈ చిత్రం పలుభాషల్లో రీమేక్‌ కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని ‘కబీర్‌ సింగ్‌’గా తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే ఈ చిత్రం టీజర్స్‌తో అంచనాలు పెంచేసింది. తాజాగా చిత్రయూనిట్‌ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.

షాహిద్‌ కపూర్‌ కబీర్‌ సింగ్‌ పాత్రలో.. కియార అద్వాణీ ప్రీతిగా అదిరిపోయేలా నటించారు. ఒరిజనల్‌లో ఉన్న ఫీల్‌ను రీమేక్‌లో కూడా వచ్చేట్టు చేశాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. విజయ్‌ నటనకు షాహిద్‌ యాక్టింగ్‌కు పోలిక పెట్టలేము కానీ, షాహిద్‌ కూడా కబీర్‌పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశాడు. మరి ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌ సృష్టిస్తుందో చూడాలి. జూన్‌ 21ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement