మాజీ భర్తతో సీత | Seeta act with Former husband | Sakshi
Sakshi News home page

మాజీ భర్తతో సీత

Dec 21 2015 2:06 AM | Updated on Sep 3 2017 2:18 PM

మాజీ భర్తతో సీత

మాజీ భర్తతో సీత

దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ తారల్లో నటి సీత ఒకరు.

దక్షిణాదిలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ తారల్లో నటి సీత ఒకరు. ఆమె తమిళం, తెలుగు భాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడు పార్తిబన్‌తో కలిసి పుదియపాదై చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే వారిద్దరిని ప్రేమలో పడేసి పెళ్లికి దారి తీసింది. అయితే పార్తిబన్, సీతల ప్రేమ వివాహంలో కొంతకాలం తరువాత ముసలం పుట్టింది. అది విడాకులకు దారి తీసింది.
 
 ఆ తరువాత ఇద్దరూ విడివిడిగా జీవిస్తూ నటిస్తున్నారు. అలాంటిది విడిపోయిన ఈ దంపతులను ఒకే చిత్రంలో నటింప చేయడంలో దర్శకుడు ఏఎం ఆర్ రమేష్ సఫలీకృతమయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఒరు మెల్లియకొడు అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తమిళం, కన్నడం)లో నటి సీతతో పాటు పార్తిబన్ కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. 25 ఏళ్ల క్రితం పుదియపాదైలో పార్తిబన్‌తో నటించిన సీత తాజాగా ఇప్పుడు ఒరు మెల్లియ కొడు చిత్రంలో నటించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement