నలుగురి కథ | satyagang a new film started in hyderabad | Sakshi
Sakshi News home page

నలుగురి కథ

Nov 24 2016 11:07 PM | Updated on Sep 4 2017 9:01 PM

నలుగురి కథ

నలుగురి కథ

నలుగురు యువకులు ఓ లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగుపెడతారు. డబ్బు సంపాదన కోసం వారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారు?

నలుగురు యువకులు ఓ లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగుపెడతారు. డబ్బు సంపాదన కోసం వారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారు? సరైన దారిలో నడిచారా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. ప్రత్యూష్ వి.ఆర్, హర్షితా పన్వర్, కిషన్ కన్నయ్య కె.కె, సాత్విక్, సిరికొమ్ము ప్రధాన పాత్రల్లో ప్రభాస్ నిమ్మలను దర్శకత్వంలో మహేశ్ కన్నా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైద రాబాద్‌లో జరిగింది. దర్శకుడు సముద్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు బి. కాశీవిశ్వనాథం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మా చిత్ర దర్శకుడు, సముద్ర గారి వద్ద పనిచేశాడు. తను రాసుకున్న కథ నచ్చడంతో నిర్మిస్తున్నాం’’ అని మహేశ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్, సహ నిర్మాతలు: ఎస్.మంగారావు-చలపతి, కథ,-స్క్రీన్‌ప్లే-సంగీతం-మాటలు-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల.

Advertisement
 
Advertisement
Advertisement