సత్య-2 చిత్రం విడుదల నవంబర్ 8కి వాయిదా: వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సత్య-2 చిత్రం విడుదలను వాయిదా వేశారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సత్య-2 చిత్రం విడుదలను వాయిదా వేశారు. తొలుత అక్టోబర్ 25 తేదిన విడుదల కావాల్సి ఉండగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మకు, దర్శకుడికి మధ్య వివాదం తలెత్తడంతో నవంబర్ 8 తేదికి వాయిదా వేసినట్టు తెలిసింది.
ఎల్ఆర్ ఆక్టివ్ సంస్థ అధినేత అరుణ్ శర్మ తో తెగతెంపులు చేసుకోవడం లాంటి అంశాలు చిత్ర విడుదల వాయిదాకు దారి తీసాయని రాంగోపాల్ వర్మ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పునీత్ సింగ్, అనైక సోటి, ఆరాధన గుప్తాలు నటించిన సత్య-2 చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.