breaking news
Satya 2
-
ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో రామ్‌గోపాల్ వర్మ పిటిషన్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్య-2 సినిమా విడుదల సందర్భంగా ధనలక్ష్మి తనను ఇబ్బంది పెట్టినట్లు వర్మ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని వర్మ శనివారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ధనలక్ష్మి అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. సత్య-2 శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు హిందీ భాషలోకంటే తెలుగులో చాలా ఎక్కువ కట్స్ పడినట్లు కూడా వర్మ వివరించారు. -
వర్మ మారడా?
-
నేను నిలబడితే జనం కొడతారు
రామ్‌గోపాల్‌వర్మ తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తాడు. అప్పుడప్పుడు అవి ప్రపంచానికి కూడా నచ్చేస్తుంటాయ్ ‘26/11’లా. ఆయన దర్శకత్వం వహించిన ‘సత్య-2’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు వర్మ మార్క్ సమాధానాలు మీకోసం. మాఫియా సినిమాలు తీస్తున్నారు... వాళ్ల నుంచి ప్రాబ్లమ్స్ వస్తే? మాఫియా నుంచి థ్రెట్ ఉందని క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ అలాంటిదేం జరగలేదు. ఎందుకంటే నాకు మాఫియా గురించి ఇంటిలిజెన్స్ బ్యూరో కంటే ఎక్కువ తెలుసు. ఈ మధ్య ఓ మీడియా చానల్‌తో గొడవైందట? నా సినిమాలో నాలుగు ఐడెంటిటీ ఉన్న పాత్రలు కావాలి. అందుకే ఆ పాత్రలకు నలుగురు తెలిసిన మనుషుల పేర్లు పెట్టా. అందులో ఒక పేరు ‘ప్రకాష్వ్రి టీవీ 8’. దాంతో ఆ చానల్ వారికి కోపం వచ్చింది. వాళ్లు మాత్రం నాపై ‘వర్మకు మతి పోయిందా’ అంటూ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. నేను మాత్రం వాళ్ల పేరును కేరక్టర్‌కి వాడకూడదు. ఇదేం న్యాయం. అనసవరంగా అందరినీ ఎందుకు శత్రువుల్ని చేసుకుంటారు? నాకు ఎవరు శత్రువులు ఉండరు. వాళ్లే నన్ను శత్రువుగా చూస్తుంటారు. పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు పదేపదే చెబుతున్నారు? అతనిలో నిజాయితీ ఉంది. చూట్టానికి బాగుంటాడు. సినిమాల్లో అయితే... థియేటర్లోనే చూడాలి. రాజకీయాల్లోకొస్తే రోజూ న్యూస్ చానల్స్‌లో చూడొచ్చు కదా. వాళ్లూ వీళ్లూ ఎందుకు.. మీరే నిల్చోవచ్చుగా? నేను నిలబడితే జనం కొడతారు. ఈ మధ్య స్టార్స్‌తో సినిమా తీయడంలేదే? వాళ్ల ఇమేజ్‌ని, గ్రాఫ్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడం నాకు చేతకావడం లేదు. మీ సినిమాల్లో హీరోలు డాన్సులు చేయరే? అబ్బాయిలు డాన్సులు చేస్తే ఎవరు చూస్తారు? అమ్మాయిలు చేస్తే చూస్తారు. మామగారు అయ్యారుగా ఎలా ఉంది ఫీలింగ్? నా కూతురు కూడా నన్ను ‘రాము’ అనే పిలుస్తుంది. అందుకే ఆ లిస్ట్‌లో నన్ను చేర్చొద్దు. పాట పాడారు. పాట రాశారు. సినిమా తీశారు. డెరైక్షన్ సరేసరి... మరి నటన ఎప్పుడు? అలా మాత్రం నన్ను చూడలేరు. ఎందుకంటే మీరంటే నాకు సింపతి. ఇబ్బంది పెట్టలేను. -
సెన్సార్ బోర్డ్ సభ్యురాలిపై క్రిమినల్ కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ
-
సెన్సార్‌బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్‌గోపాల్ వర్మ
హైదరాబాద్: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది. తెలుగులో విడుదలకు అడ్డంకులు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడ్డారని వర్మ ఆరోపణ. ధనలక్ష్మిపై రేపు నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ చెప్పారు. ధనలక్ష్మిపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. -
సత్య-2 చిత్రం విడుదల నవంబర్ 8కి వాయిదా: వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సత్య-2 చిత్రం విడుదలను వాయిదా వేశారు. తొలుత అక్టోబర్ 25 తేదిన విడుదల కావాల్సి ఉండగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అరుణ్ శర్మకు, దర్శకుడికి మధ్య వివాదం తలెత్తడంతో నవంబర్ 8 తేదికి వాయిదా వేసినట్టు తెలిసింది. ఎల్ఆర్ ఆక్టివ్ సంస్థ అధినేత అరుణ్ శర్మ తో తెగతెంపులు చేసుకోవడం లాంటి అంశాలు చిత్ర విడుదల వాయిదాకు దారి తీసాయని రాంగోపాల్ వర్మ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పునీత్ సింగ్, అనైక సోటి, ఆరాధన గుప్తాలు నటించిన సత్య-2 చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. After disaccoiating with all L R Active Arun Sharma related issues Satya 2 will now release on November 8th instead of october 25th — Ram Gopal Varma (@RGVzoomin) October 22, 2013 -
వర్మ అంటే నాకేమీ కోపం లేదు: అమితాబ్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తనకేమీ కోపం లేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి సర్కార్, సర్కార్ రాజ్, రాంగోపాల్ వర్మా కీ ఆగ్, డిపార్ట్మెంట్ లాంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా గురించి వర్మ తిడుతూ ట్వీట్లు చేసిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి. తర్వాత డిపార్ట్మెంట్ సినిమా మధ్యలోంచి అభిషేక్ బచ్చన్ వెళ్లిపోవడంపై వర్మ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డాడు. తర్వాత ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా 'సత్య 2' సినిమా ప్రమోషన్ కోసం వర్మ ఇచ్చిన ఓ పార్టీకి అమితాబ్ కూడా హాజరయ్యారు. సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన సంబంధాలు దెబ్బతింటాయనుకుంటే అది తప్పని, వర్మ అంటే తనకేమాత్రం కోపం లేదని ఈ సందర్భంగా అమితాబ్ అన్నారు. పైపెచ్చు, వర్మతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. గతంలో తాను హృషికేశ్ ముఖర్జీతో కలిసి ఎక్కువ సినిమాలు చేశానని, కానీ వర్మ ఇప్పుడు ఆ జాబితా దాటేశారని తెలిపారు. షూటింగ్ సమయంలో తామిద్దరి మధ్య మంచి అవగాహన ఉండటంతో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందని, అందుకే తాను మళ్లీ మళ్లీ వర్మ సినిమాల్లో నటిస్తుంటానని అమితాబ్ చెప్పుకొచ్చారు. -
పాతుకుపోయిన వాళ్లతో చేయడం తలనొప్పి: రాంగోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా వార్తల్లోనే నిలుస్తాడు. ఆయన కొత్తగా తీసిన 'సత్య2' సినిమా కోసం దాదాపు అందరినీ కొత్త నటీనటులనే తీసుకున్నాడు. ఈ సినిమాలో పునీత్ సింగ్, అనైకా సోథీ, ఆరాధన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ''కొత్తవాళ్లతో పనిచేయడం హాయి. ఎందుకంటే, అది వాళ్ల మొదటి సినిమా అవుతుంది కాబట్టి వాళ్లు బాగా కష్టపడి పనిచేసి నూటికి నూరుశాతం పెర్ఫార్మెన్సు చూపిస్తారు. వాళ్లు సెట్ మీదకు వచ్చేసరికే మొత్తం సిద్ధమై వస్తారు. అదే అప్పటికే పాతుకుపోయినవాళ్లయితే... వాళ్లు బోలెడంత బ్యాగేజితో వస్తారు. ఏదైనా తమ ఇష్టం అన్నట్లుంటారు. వాళ్లు అప్పటికే ఇరుక్కున్న ఇమేజి చట్రం లోంచి బయటకు తీసుకొచ్చి, వాళ్ల క్యారెక్టర్లో ఇమిడిపోయేలా చేయడం చాలా కష్టం'' అని రాంగోపాల్ వర్మ ముంబైలో మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలాంటి అనుభవాలు గతంలో సీనియర్ నటులతో ఉన్నాయా అని అడగ్గా.. అలాంటిదేమీ పెద్దగా లేదని, అంతకుముందు నటించిన వారు ఎవరికైనా ఒక ఇమేజి ఉంటుందని, ఉన్నట్టుండి వాళ్లను ఒక రియల్ సన్నివేశంలో చేయమంటే వాళ్లకు అది చాలా కష్టం అయిపోతుందని, అందుకే తానలా చెప్పానని అన్నారు. -
మా అమ్మాయి పెళ్లికి కూడా గెస్ట్లాగానే వెళ్లాను...
తొంభైలలో వర్మ కనిపించేవాడు కాదు. అతడి సినిమాలు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వర్మ మాత్రమే కనిపిస్తున్నాడు. అతడి సినిమాలు కనిపించడం లేదు! ఇలాంటివి వంద... వంద బ్లైండ్ అండ్ రూడ్ కామెంట్లు వర్మ మీద! మీడియా యావ ఎక్కువైందని... ఎప్పుడేం చేస్తాడో తెలియదనీ... ఎవర్నేమంటాడో చెప్పలేమనీ... సెల్ఫిష్ అనీ, ‘కాంట్రావర్ట్’ అనీ... పద్ధ్దతీ పాడూ లేని మనిషనీ... మొత్తానికే ‘మోస్ట్ అన్వాంటెడ్’ అని... ఇండస్ట్రీ లోపల, బయట వర్మపై... ఓ గొప్ప ‘సదభిప్రాయం’! వర్మ దేన్నీ కాదనడు. అనకపోగా, ‘నేనింతే’ అంటాడు. అతడంతే కాకపోయినా అలాగే అంటాడు! కనీసం ఖండించడా? వర్మకంత టైమ్ లేదు, ఉండదు కూడా. ఇప్పుడతడు ‘సత్య-2’లో బిజీ. సత్యాసత్యాల వివరణ అతడి దృష్టిలో... పెద్ద టైమ్ వేస్ట్ కార్యక్రమం. అంతే. ఈవారం ‘తారాంతరంగం’ చదవండి. రామ్‌గోపాల్ వర్మను తిట్టుకోడానికిఫెష్గా మరికొన్ని కారణాలు కనిపిస్తాయి! మీ దగ్గర కథలు అయిపోయాయా? ‘సత్య-2’ అని సీక్వెల్ చేస్తున్నారు? రామ్‌గోపాల్‌వర్మ: ఇది ‘సత్య’కు సీక్వెల్ అని ఎవరు చెప్పారు? టైటిల్లో ‘సత్య’ అని ఉన్నంత మాత్రాన సీక్వెల్ అనేసుకోవడమేనా? సిటీ అన్నాక చాలామంది మనుషులు వస్తుంటారు. 1997లో సత్య అనేవాడు సిటీకి వచ్చి మాఫియాలో ఎలా ఇరుక్కున్నాడన్నది ఆ ‘సత్య’ కథ. 2013లో సిటీకొచ్చిన ఇంకో సత్య కథ ఇది. అసలు దానికీ దీనికీ కథ విషయంలో కాని, పాత్రల విషయంలో కానీ ఎటువంటి పోలికా లేదు. నేపథ్యం మాత్రం ఒక్కటే. అందుకేనా... జేడీ చక్రవర్తిని వదిలేసి శర్వానంద్‌ని తీసుకున్నారు? వర్మ: ‘ప్రస్థానం’లో శర్వానంద్ రియలిస్టిక్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. ‘సత్య-2’ కూడా రియలిస్టిక్ మూవీ కాబట్టి, తను కరెక్ట్ అనిపించింది. ‘సత్య’ నాటి రామ్‌గోపాల్‌వర్మకు, ‘సత్య-2’ రామ్‌గోపాల్‌వర్మకు చాలా వ్యత్యాసమొచ్చేసినట్టుంది? వర్మ: డెఫినెట్‌గా వ్యత్యాసం ఉంది. మనిషెప్పుడూ ఒకేలా ఉండడు కదా. మనం బ్లాంక్ మైండ్‌తో పుడతాం. పెరిగిన వాతావరణం, కలిసిన మనుషులు, చదివిన పుస్తకాలు... వీటన్నిటితో మనకో ఆలోచనా విధానం ఏర్పడుతుంది. అది ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటుంది. ‘శివ’లో సైకిల్ చైన్ ఎపిసోడ్ నాకప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అదే ఇప్పుడు చాలా ఛైల్డిష్ థాట్లాగా అనిపిస్తుంది. తెలుగు సినిమా ఓ దారిలో వెళ్తుంటే, మీరో కొత్తమార్గం చూపించారు. అదిప్పుడు పాతబడిపోయింది. మళ్లీ ఇంకో కొత్త రూట్ కనిపెట్టాలనుకోవడం లేదా? వర్మ: దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత... ఇలా ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్‌తోనే చివరివరకూ పని చేస్తాడు. రాబిన్ కుక్ ఫేమస్ రైటర్. 40 ఏళ్ల నుంచి రాస్తూనే ఉన్నాడు. అన్నీ మెడికల్ థ్రిల్లర్సే. కథలు వేరు కావచ్చు. పాత్రలు వేరు కావచ్చు. కానీ కోర్ ఎలిమెంట్ మాత్రం ఒక్కటే. నేను కూడా అలాంటి టేస్ట్‌తోనే పని చేస్తుండొచ్చు. నేను ‘శివ’ తీసే సమయానికి నేనేదో బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నానని, కొత్త రూట్ కనిపెట్టబోతున్నానని ఏ మాత్రం అనుకోలేదు. నేనెలా ఆలోచిస్తానో, నాకెలాంటి సినిమా నచ్చుతుందో... సరిగ్గా అలానే ‘శివ’ తీశానంతే. మీడియాతో కూడా అప్పుడెలా మాట్లాడానో ఇప్పుడూ అంతే. ప్రశ్నలు మారొచ్చు, జవాబులు మారొచ్చు కానీ, నా ఐడియాలజీ మాత్రం మారలేదు. ఓకే... అయితే అప్పుడు మీడియాతో ఇంతలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేది కేవలం మీడియాతోనే కదా! వర్మ: నేనెప్పుడూ మాట్లాడతాను. అయితే అప్పట్లో ఇంత మీడియానే లేదు. ఉండుంటే, అప్పుడూ ఇలాగే మాట్లాడేవాణ్ణి. ఏమో... మునుపటితో పోలిస్తే మీరు ఫిలిం మేకింగ్‌పై కన్నా ప్రమోషనల్ యాక్టివిటీస్పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టనిపిస్తోంది? వర్మ: అంటే నాకు పబ్లిసిటీ వ్యామోహం ఎక్కువైందనేగా మీ ఉద్దేశం? నేనిలాంటి కామెంట్లని అస్సలు ఖాతరు చేయను. ఈ రోజుల్లో ఫిలిం మేకింగ్ ఎంత ఇంపార్టెంటో, ప్రమోషనూ అంత ఇంపార్టెంట్. నేనొక్కణ్ణే కాదు, ప్రపంచం అంతా చేస్తున్న పని ఇదే. దేశంలో ఏం జరిగినా రియాక్టయ్యి వెంటనే సినిమా ఎనౌన్స్ చేసేస్తుంటారు... వర్మ: అలా నేనెప్పుడూ చేయలేదు. అయినా నేను అన్ని సంఘటలనకూ రియాక్ట్ కాను. కొన్నే కదిలిస్తాయి. నన్ను కదిలించిన వాటితోనే సినిమా చేయాలనుకుంటాను. ముంబై తాజ్హోటల్లో బాంబు పేలుళ్ల నేపథ్యంలో ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ తీశాను. ఈమధ్య నేను చేసింది ఇదొక్కటే కదా. వీరప్పన్ చనిపోయినపుడు అతనిపై సినిమా తీస్తానన్నారు. ‘పెళ్లి’ టైటిల్‌తో అయిదుగురు దర్శకులతో కలిసి సినిమా అన్నారు. రాజకీయాలపై సినిమా అన్నారు. ఇలా ఎక్కువగా ప్రకటనలకే పరిమితమైపోతున్నారు? వర్మ: సినిమా అనేది ఒక ఐడియా. ఏదో ఒక ఆలోచన వచ్చి సినిమా చేద్దామనుకుంటా. అది స్క్రిప్ట్ రూపమో, సినిమా రూపమో దాల్చే సమయానికే ఆ ఆలోచన నాకే ఎగ్జైటింగ్‌గా అనిపించకపోవచ్చు. లేకపోతే అంతకన్నా గొప్ప ఆలోచన పుట్టొచ్చు. మనసు మార్చుకోవడమనేది అందరికీ కామన్. ప్రకటనలేమీ శిలాశాసనం కాదు కదా. మాఫియా, దెయ్యాలు... ఈ రెండు నేపథ్యాలను పట్టుకుని ఎన్నాళ్లు వేలాడతారండీ? వర్మ: నేను తీసిన మొత్తం సినిమాల జాబితా చూడండి. నేను చేసినన్ని వేరియేషన్స్ ఇండియాలో ఇంకే దర్శకుడూ చేయలేదు. ‘శివ’... స్టూడెంట్ పాలిటిక్స్, ‘క్షణక్షణం’... కీపర్ ఫిలిమ్, ‘గోవిందా గోవిందా’... అడ్వంచరస్, ‘అనగనగా ఒకరోజు’... సిట్యుయేషనల్ కామెడీ, ‘రంగీలా’... లవ్‌స్టోరీ, ‘కంపెనీ’... మాఫియా, ‘రన్’... మీడియా, ‘ఇట్స్ నాట్ ఎ లవ్‌స్టోరీ’... మర్డర్ మిస్టరీ, ‘రక్తచరిత్ర’... ఫ్యాక్షనిజమ్, ‘26/11’... టైజమ్, ‘భూత్’... హారర్. ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశాను. నేను టచ్ చేయనిది ఒకే ఒక్కటి... ఫ్యామిలీ డ్రామా. వాటిని చూడ్డానికే ఇష్టపడను కాబట్టి, నేను అలాంటివి చేయను. ఈ మధ్య మీరు పాటలు రాయడం, పాడడం కూడా చేసేస్తున్నారు? వర్మ: ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను. ఏనాడూ రాయాలని, పాడాలని అనుకోలేదు. ఏంటో ఈ మధ్యనే అనిపిస్తోంది. ఓ రికార్డుగా పడుంటుందనే ఆలోచన కూడా కావచ్చు. అయితే, ఇదంతా హాబీగానే చేస్తున్నాను. పెద్ద సీరియస్‌నెస్ లేదు. ‘రక్తచరిత్ర’లో ‘కత్తులతో సావాసం’ పాట నేను పాడితేనే బావుంటుందనిపించింది. పాడేశానంతే. ‘సత్య-2’లో ‘ఓ ప్రియా...’ అనే రొమాంటిక్ సాంగ్‌ని మొదట వేరే సింగర్ పాడితే నచ్చలేదు. దాంతో మ్యూజిక్ డెరైక్టర్ నన్నే పాడమన్నాడు. నిజంగా నేను పాడితే బావుంటుందనుకున్నాడో, లేక ఈయనతో పాడిస్తే గొడవ వదిలిపోతుందనుకున్నాడో నాకైతే తెలియదు. ‘రక్త చరిత్ర’లో వాయిస్ ఓవర్ కూడా చెప్పారుగా... వర్మ: అది నేను సృష్టించిన కథ కాబట్టి, నాక్కావాల్సిన ఎమోషన్ ఏంటో నాకే తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే వాయిస్ ఓవర్ చెప్పాగానీ, నా వాయిస్‌లో గాంభీర్యం ఉందని చాటుకోవడానిక్కాదు. యాక్టింగ్ కూడా చేస్తారా? వర్మ: అది ఇంపాజిబుల్. నేను స్టిల్ కెమేరా ముందు కూడా సరిగ్గా పోజివ్వలేను. ఇక మూవీ కెమేరా ముందు ఎక్కడ నిలబడగలను? నన్ను యాక్ట్ చేయమని ఇద్దరు, ముగ్గురు అడిగారు కూడా. అసలు ఇప్పుడున్న బిజీలో మీకు స్క్రిప్టులు రాసే ఓపిక, తీరిక ఉందా? వర్మ: మీకో నిజం చెప్పనా... అసలు నేనిప్పుడే స్క్రిప్టులు రాస్తున్నాను. అంతకుముందెప్పుడూ రాసేవాణ్ణి కాదు. స్క్రిప్టులు రాయడం మొదలెట్టాకే, నాకు ఎక్కువ ఫ్లాప్స్ రావడం మొదలైంది. కేర్‌ఫుల్‌గా రాస్తేనే, కేర్‌ఫుల్‌గా ఫ్లాప్ తీస్తానని తెలుసుకున్నాను. అదేంటి చిత్రంగా ఉంది మీ లాజిక్. ఏ సినిమాకైనా బౌండ్స్క్రిప్ట్తో వెళ్లాలని అందరూ చెబుతుంటారుగా? వర్మ: ఏమో... నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒక ప్రేమకథ తీయాలనుకుంటాం. వారిద్దరి మధ్యనా ప్రేమ ఎలా పుడుతుందనేది మనం చూపించడాన్ని బట్టి ఉంటుంది. ఆ లొకేషన్స్, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్... ఇవన్నీ కలిస్తేనే సినిమా బాగా తయారవుతుంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అనేది వట్టి కథ మూలంగా వస్తుందనుకోవడం భ్రమ. ఎందుకంటే మంచి కథల్ని చెడగొట్టిన దర్శకులూ ఉన్నారు. కథ బాగున్నంత మాత్రాన సినిమా బాగా వస్తుందనుకోవడం ఆబ్సెల్యూట్లీ రాంగ్ థింకింగ్. అంటే స్క్రిప్టు లేకుండా సినిమాలు చేసేయొచ్చునా? వర్మ: నేనైతే చాలా చేశాను. చాలా సినిమాలకు నా దగ్గర స్క్రిప్టు లేదు. అప్పటికప్పుడు ఆలోచించి తీశాను. కథ లేకపోయినా కేరెక్టర్లు మాత్రం తెలియాలి. ఫలానా సిట్యుయేషన్లో ఆ కేరెక్టర్లు ఏం చేస్తాయనే క్లారిటీ ఉంటే మాత్రం ఆ సినిమా బాగా వస్తుంది. మరి స్క్రిప్టు రాయడం ఎప్పటినుంచీ మొదలుపెట్టారు? వర్మ: సరిగ్గా గుర్తులేదు కానీ, గత ఏడెనిమిదేళ్ల నుంచీ స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టినట్టున్నాను. ‘అంతం’ లో ‘నీ నవ్వు చెప్పింది నాతో...’ ఎక్స్ట్రార్డినరీ సాంగ్. మీ తొలినాటి సినిమాల్లో చాలా పాటలు అలా పొయిటిగ్గా, రొమాంటిగ్గా ఉండేవి. ఇప్పుడా ఫ్లేవరే కనబడడం లేదెందుకని? వర్మ: నాలుగైదేళ్లుగా నేను వేరే జానర్ సినిమాలు ఎక్కువ చేస్తుండడం వల్ల అలాంటి రొమాంటిక్ సాంగ్స్ పెట్టడం కుదరడం లేదు. ఆ కైండాఫ్ ఎమోషన్ కనెక్ట్ అయితే, మళ్లీ అలాంటి సాంగ్స్ పెడతాను. ఈ మధ్య ట్విట్టర్లో పవన్‌కల్యాణ్ మీద పడ్డారు. పవన్‌తో రాజకీయ పార్టీ పెట్టించాలని కంకణం కట్టుకున్నారా ఏంటి? వర్మ: నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. తను మాట్లాడుతుంటే ఓ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. తనని చూస్తుంటే ఓ వోల్కనో తనలో దాగుందేమో అనిపిస్తుంది. నిజానికి నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు. ఎవరు ఏ పార్టీనో కూడా పట్టించుకోను. కానీ ఓ కామన్‌మేన్‌గా కల్యాణ్‌ని చూస్తే ఓ బాల్‌థాకరే లాగా కరిష్మా ఉన్న లీడర్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. రాజ్థాకరేలాగా జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేయగలడు తను. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఎలాంటి ప్రభంజనం వచ్చిందో, తనకూ అలా వస్తుంది. ఇంతకూ మీకు పవన్‌కల్యాణ్‌తో పరిచయం ఉందా? వర్మ: పెద్దగా లేదు. ఇప్పటికి రెండుసార్లు కలిసి ఉంటానేమో. అది కూడా అయిదారేళ్ల క్రితమే. భవిష్యత్తులో పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తారా? వర్మ: కల్యాణ్‌కున్న ఫాలోయింగ్, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన అభిమానుల్ని రంజింపచేసే విధంగా సినిమా తీసే సామర్థ్యం, సెన్సిబిలిటీస్ నాకు లేవు. అందుకే నేను తీయను, తీయలేను. మీ ట్వీట్లన్నీ గిచ్చే విధంగా ఉంటాయి. అంత డోన్ట్కేరా? వర్మ: ఇక్కడ డోన్ట్‌కేర్ అనేది ప్రశ్నే కాదు. ట్విట్టర్ అనేది మన అభిప్రాయాల్ని పలువురితో పంచుకోవడానికి ఉపకరించే వేదిక. నచ్చినవాళ్లు ఫాలో అవుతారు. నచ్చనివాళ్లు పట్టించుకోరు. ఎవర్నీ బలవంతంగా ఫాలో కమ్మనలేం కదా. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మనకు నచ్చింది ఏదైనా చెప్పగలిగే స్వేచ్ఛ మనకుంది. మనోభావాలు గాయపడతాయని అనుకోరా? వర్మ: ఎవరి మనోభావాలు గాయపడతాయి? ఒక విషయం గురించి నా అభిప్రాయం వెల్లడిస్తానే కానీ, వ్యక్తిగతంగా ఎవర్నీ కామెంట్ చేయను. బాలీవుడ్ దర్శకుడు కరణ్‌జోహార్‌ని ఎక్కువ కామెంట్ చేస్తుంటారుగా? వర్మ: నేనెప్పుడూ తనని వ్యక్తిగతంగా విమర్శించలేదు. మా ఇద్దరి మధ్యనా ఏదో కోల్డ్‌వార్ జరుగుతోందని మీడియానే ఎక్కువ ఊహించేసుకుంటూ ఉంటుంది. రాజకీయాల గురించి మీ అభిప్రాయం? వర్మ: ఇందాకే చెప్పానుగా. నాకస్సలు అవగాహన లేదు. పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజ్‌గోపాల్ మీకు క్లోజ్‌ఫ్రెండ్ కదా! వర్మ: ఫ్రెండ్షిప్ వేరు. ప్రొఫెషన్వేరు. అతని రాజకీయాల గురించి నాకు తెలియదు నా సినిమాల గురించి అతనికి తెలియదు. మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేస్తానంటే? వర్మ: తెలిసి తెలిసి అంత మూర్ఖపు పని ఎవ్వరూ చేయరు. అయినా ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశం నాకేమాత్రం లేదు. ప్రజల కోసం పాటు పడాలనే మనస్తత్వం నాకు ఒక్క శాతం కూడా లేదు. అంటే... మీరు, మీ ప్రపంచం తప్ప ఇంకేమీ అవసరం లేదన్నమాట? వర్మ: అవును. నాకు నేనే ముఖ్యం. ‘మనం’ అనే పదం నా డిక్షనరీలో ఉండదు. పైకి ఇలా మాట్లాడతారు కానీ, మీరు రిలేషన్స్కి ప్రాధాన్యమిస్తారని మీ సన్నిహితులే చెబుతుంటారు? వర్మ: అది వాళ్ల అపోహ అంతే. వాళ్లని ఆ భ్రమల్లోనే ఉండనివ్వండి. నేను అనుకున్నంత చెడ్డవాణ్ణి కాదనేది వాళ్ల అభిప్రాయం. కానీ నేను వాళ్లు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ చెడ్డవాణ్ణి. నిజంగా చెడ్డవాడు కూడా తాను మంచోణ్ణనే చెప్పుకుంటాడు కదా! వర్మ: కానీ నేను నిజంగా చెడ్డవాణ్ణే. పెద్దలను గౌరవించకపోవడం, దేవుడంటే భక్తి లేకపోవడం, లెక్కలేని తనం... ఇలా సమాజం చెడ్డతనానికి నిర్వచనాలు పెట్టింది. ఆ కొలతల ప్రకారం చూస్తే నేను మహా చెడ్డవాణ్ణి. మీ నాన్నగారంటే మీకు బాగా ఇష్టమట. మీ నాన్నగారు చనిపోయిన పదేళ్ల తర్వాత గుర్తు చేసుకుని మరీ నానాపటేకర్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారట? వర్మ: ఆ సందర్భం వేరు. ఆ ఒక్క సంఘటనతోనే నన్ను జనరలైజ్ చేసేయొద్దు. నాలో నిజంగానే సద్గుణాలు లేవు. మీరు మొదట్నుంచీ ఇంతేనా? వర్మ: అవును. నాది మొదట్నుంచీ రాడికల్ నేచరే. మీ నాన్నగారి ప్రభావం మీపై ఎంతవరకూ ఉంది? వర్మ: మా నాన్నగారు వెరీ డిఫరెంట్. నాపై ఎవ్వరి ఇన్‌ఫ్లుయెన్సూ లేదు. ఇంత కరడుగట్టినట్టుగా ఉండే మీరు, మీ అమ్మాయి పెళ్లిని దగ్గరుండి జరిపించారుగా? వర్మ: ఏం చేశాను దగ్గరుండి? నేను కూడా అందరు గెస్ట్ల్లాగానే వెళ్లాను. చివరకు స్టేజ్ కూడా ఎక్కలేదు. పెళ్లిళ్లలో ఏవో తంతులు చేస్తుంటారు కదా. అవి కూడా చేయలేదు. అసలు నాకు ఈ వివాహ వ్యవస్థ మీదే నమ్మకం లేదు. అయితే నా ఇష్టాన్ని ఎవ్వరిమీదా బలవంతంగా రుద్దను. కనీసం మీ అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారా? వర్మ: నా గురించి అందరికీ తెలుసు. కాబట్టి వాళ్లూ అడగలేదు. నేనూ కడగలేదు. నేను చాలా సిల్లీ పనులు చేశాను, చేస్తాను. కానీ నాకు ఇష్టంలేని పనులు మాత్రం చేయను. మీ అమ్మాయి తన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీరేమన్నారు? వర్మ: తనకు నచ్చిన పని తను చేసింది. ఇందులో నా ప్రమేయం ఏముంది? ఇదనే కాదు, నేను ఏ విషయంలోనూ ఎవ్వరికీ సలహాలు ఇవ్వను. సలహాలు తీసుకోను. పెళ్లి మీద ఏహ్యభావం ఎందుకని? వర్మ: నా దృష్టిలో పెళ్లంటే ఓ జైలు. జీవితాంతం ప్రేమలో ఉండడం కరెక్ట్. పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ పోతుందనేది నా ఫీలింగ్. మన భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యం కదా! వర్మ: అదొక ఏస్పెక్ట్ అంతే. భారతదేశంలో విడాకులు తీసుకోరా? ఇక్కడ అందరు భార్యాభర్తలూ సుఖంగానే ఉన్నారా? ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. పెళ్లి మీద మొదట్నుంచీ ఇదే అభిప్రాయమా? వర్మ: ఏ అభిప్రాయమైనా ఓ అనుభవం నుంచో, ఓ అవగాహన నుంచో వస్తుంది. ఈ అభిప్రాయం ఎప్పుడు పుట్టిందో కరెక్ట్ టైమ్ నేనూ చెప్పలేను. మీ అమ్మాయి పెళ్లికి వచ్చినవాళ్లు మిమ్మల్ని చూసి ఏమన్నారు? వర్మ: అక్కడ పెళ్లికి వచ్చిన చాలామంది నన్ను జోకర్లా చూడ్డానికే వచ్చారని నా ఫీలింగ్. వీడేం చేస్తాడో చూద్దామనే క్యూరియాసిటీనే ఎక్కువ కనిపించింది వాళ్లలో. మీ అల్లుడితో మాట్లాడారా? వర్మ: మాట్లాడాను. డీటైల్సేమీ అడగలేదు. తను డాక్టరని తెలుసు అంతే. నాకు సినిమా ఇండస్ట్రీ గురించి తప్పితే, వేరే ఫీల్డ్ గురించి అస్సలు అవగాహన లేదు. వాళ్లిద్దరూ డాక్టర్లు. నాకేమో హాస్పిటల్స్ అంటేనే అసహ్యం. మీరెప్పుడూ హాస్పిటల్‌కి వెళ్లలేదా? వర్మ: నేను ఒక కలల ప్రపంచంలో బ్రతుకుతాను. అందమైన అమ్మాయిలు, పవర్ఫుల్ హీరోలు, మంచిమ్యూజిక్... ఇలా నా ప్రపంచమంతా ఇదే. హాస్పిటల్ అనగానే ఏదో డిస్కనెక్ట్లాగా అనిపిస్తుంది. డార్క్ రియలిజాన్ని ఎప్పుడూ ఎవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక మనిషిని హాస్పిటల్ బెడ్ మీద చూడ్డానికి అస్సలు ఇష్టపడను. ఎవరైనా చనిపోతే నేను చూడ్డానికి వెళ్లను. అమితాబ్ బచ్చన్ గారికి నేను చాలా క్లోజ్. ఆయన మదర్ పోయినప్పుడు నేను చూడ్డానికి వెళ్లలేదు. డెడ్‌బాడీని చూడ్డం నాకస్సలు ఇష్టం ఉండదు. మనీషా కొయిరాలా నాకు చాలా క్లోజ్. తనకు కేన్సర్ వచ్చినప్పుడు నేను చూడ్డానికి వెళ్లలేదు. ‘నా లైఫ్‌లో నాకు నచ్చిన బ్యూటీవి నువ్వు. అలాంటి నిన్ను హాస్పిటల్లో జుట్టులేకుండా చూడలేను’ అంటూ ఓ మెసేజ్ పంపించాను. తనకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, వెంటనే అర్థం చేసుకోగలిగింది. ఎవరేమనుకున్నా నా కలల ప్రపంచంలోంచి నేను బయటకు రాను. హాస్పిటల్‌కు వెళ్లడం, వెళ్లకపోవడమనేది మన చేతుల్లో ఉండదు కదా? వర్మ: అది తెలుసు నాకు. అందుకే మన చేతిలో లేని దాని గురించి ఆలోచించను. ఒకవేళ హాస్పిటల్‌కు వెళ్లాల్సివస్తే? వర్మ: అవసరమొస్తే చస్తామా? వెళ్తాను. కానీ వెళ్లడం ఇష్టం లేదు. మీకిలా ఒంటరిగా ఉండటమే ఇష్టమా? వర్మ: చాలా. ఒంటరిగా ఉన్నా నాకస్సలు బోర్ కొట్టదు. ‘5డి’ కెమెరాతో కూడా సినిమా చేయొచ్చని ‘దొంగల ముఠా’ సినిమాతో నిరూపించారు. దానివల్ల ఎంత మంచి జరిగిందో, అంత చెడు కూడా జరిగిందని తెలుసా? వర్మ: మైనస్ జరిగిందని నేననుకోను. నా ఉద్దేశంలో ‘5డి’ అనేది ఫిలిం మేకింగ్‌ని డెమక్రటైజ్ చేసేసింది. దీనివల్ల ఎవరైనా సినిమా చేసేయ్యొచ్చు. అయితే ఎంత బాగా తీస్తారు, ఎలా రిలీజ్ చేస్తారన్నది నెక్ట్స్ లెవెల్. ఈ 5డి వల్ల కొంతమందైనా వెలుగులోకొచ్చి, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్నారు. వర్కవుట్ అవ్వడం, కాకపోవడమన్నది వేరే సంగతి. 5డి అనే కాదు, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఇలాంటివి సర్వసాధారణం. భవిష్యత్తులో సినిమా మేకింగ్ ఎలా ఉండబోతుందనేది మీ అంచనా? వర్మ: భవిష్యత్తులో యాక్టర్స్, యానిమేషన్ రెండూ కలగలిసిపోవాల్సిందే. సెపరేట్ చేయడమనేది చాలా కష్టమైపోతుంది. యాక్టర్స్ ఇంపార్టెన్స్ కంప్లీట్‌గా పోతుంది. హాలీవుడ్లో ఇప్పటికే స్టార్ సిస్టమ్ కొలాప్స్. ఫిలిం మేకింగ్‌లో ఇంకా ఇంకా అడ్వాన్స్ అయిపోతాం. కొత్త కొత్త కెమెరాలొస్తాయి. నా ఉద్దేశంలో రెండేళ్ల తర్వాత ఆర్టిస్టులు కెమేరా వైపు చూడనవసరం లేదు. అసలు షూటింగ్లో కెమేరా అనేదే ఉండదు. మన కళ్లల్లాగా అన్నీ పిన్‌పాయింట్ థింగ్స్ ఉంటాయి. మన ఐబాల్ సైజులో కెమేరాలొచ్చేస్తాయి. ఇక ఆర్టిస్టులు ఎంతసేపూ కెమేరాను చూడడం, క్లోజా, మిడ్క్లోజా అని ఆలోచించడం అవసరం లేదు. కెమేరా కనపడనప్పుడు కచ్చితంగా వాళ్ల పెర్ఫార్మెన్స్ మారిపోతుంది. అది డెఫినెట్‌గా వస్తుంది. చాలా తొందరగా కూడా వస్తుంది. లైటింగ్, కెమేరాలు ఉండవు. జస్ట్ యాక్టర్స్ ఉంటే, డెరైక్టర్ వేరే రూమ్‌లో ఉండి, చిన్న మానిటర్లో చూసి ఏదైనా డైలాగు ఛేంజ్ చేస్తారేమో కానీ, పెద్ద యూనిట్ అనేది ఉండదు. ప్రతిభను ప్రోత్సహించే విషయంలో ముందుంటారు కానీ, పారితోషికాలు చెల్లించే విషయంలో చాలా వెనుక ఉంటారని కామెంట్. నా దగ్గర పనిచేయడమే మీకో పెద్ద ఫేవర్ అన్న ఫీలింగ్ చూపిస్తారటగా? వర్మ: సినిమా ఇండ్రస్టీ అనేకాదు, ఎక్కడైనా సరే డిమాండ్ అండ్ సప్లయ్‌లో నాకు ఇంత వర్త్, నేను ఇంత వర్త్ అని ఎక్కడా ఉండదు. నేను సినిమా తీయడానికి కంపెనీ పెడతాను కానీ, కేవలం జీతాలివ్వడానికి కాదు. నువ్వేం చేస్తావ్... దానికి ఎంత తీసుకుంటావ్... అంతవరకే. నీకు నచ్చకపోతే పని చేయొద్దు. ఎక్కడైనా అంతే. మీరో సెక్రటరీని పెట్టుకోవాలనుకుని, పది రూపాయలే ఇస్తానంటారు. అతను చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇవ్వడం నీవంతు అయితే వద్దనడం, కాదనడం అతని వంతు. ఇందులో డిస్కషన్ దేనికి? హైదరాబాద్‌లో మీకో కోటరీ ఉందని, మీరేం చేసినా ఆహా ఓహో అంటారని, మీరు కూడా ఆ ప్రశంసల వలయంలో చిక్కుకుపోయారని ఓ కామెంట్. ఏమంటారు? వర్మ: నన్ను పొగిడినా, తిట్టినా నేను కేర్ చేయను. నేనేంటో నాకు తెలుసు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ పొగిడితే, వాడు వెధవ అనుకుంటాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ విమర్శించినా వాడు వెధవ అనుకుంటాను. నాకు చాలా ఇగో ఎక్కువ. ఇగో లేనివాడే పొగడ్తలకు పడతాడు. నా అంత ఇగో ఉన్నవాడు పొగడ్తలకు అస్సలు పడడు. మీకో బ్రాండ్ వేల్యూ ఉంది. దాన్ని మీ చేతులతో మీరే సర్వనాశనం చేసుకుంటున్నారని ఎప్పుడూ అనిపించలేదా? వర్మ: నేను హిట్ సినిమాకైనా, ఫ్లాప్ సినిమాకైనా సేమ్ ఎఫర్ట్ పెడతాను. మొదట్నుంచీ అంతే. ఎవ్వరైనా కూడా ఇంతే. ఫ్లాప్ ఎందుకొస్తుందని నన్నడిగితే, అసలు హిట్ ఎందుకొస్తుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తెలిస్తే ఎందుకు ఫ్లాప్ తీస్తాను. నేను చేసేది నేను చేస్తాను. ఎలా వస్తుందో, రాదో అనేది నా కంట్రోల్లో ఉండదు. నా కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రతిదీ హిట్టే చేస్తానుగా మీ మీద ఇంకో అపప్రథ కూడా ఉంది. మంచి స్పీడ్‌లో ఉన్న హీరోతో సినిమా చేసి, వారి స్పీడ్‌కి బ్రేక్ వేస్తారని ప్రతీతి. రవితేజకి ‘షాక్’, సునీల్‌కి ‘అప్పల్రాజు’, సూర్యకి ‘రక్తచరిత్ర’... వర్మ: వాళ్లకి ఫ్లాప్ ఇవ్వడమే నా ఉద్దేశమా? ఆ ఫ్లాపు నాకూ తగిలిందిగా. కావాలని ఎందుకు చేస్తాన్నేను. మీ శ్రీదేవి మళ్లీ యాక్ట్ చేస్తున్నారుగా. ఆవిడతో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా? వర్మ: లేదండీ. నేను శ్రీదేవిగారికి అభిమానినే. కానీ ఆ అభిమానం అందం వరకూ మాత్రమే. కేవలం పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా ఆవిడతో సినిమా చేసే ఐడియా లేదు. వేరేవాళ్లు ఎవరైనా తీస్తే నేను హాయిగా టికెట్ కొనుక్కుని చూస్తాను. మీరు దేనికి భయపడతారు? వర్మ: నేను దేనికీ భయపడను. కానీ మనుషుల్లోని స్టుపిడిటీకి భయపడతాను. వాళ్లల్లోని బ్యాడ్నెస్కి, ఈవిల్నెస్కి భయపడను. అండర్ వరల్డ్‌ని ఎలా ఫేస్ చేయగలిగారు? వాళ్ల మధ్యనే ఉంటూ, వాళ్ల మీద సినిమాలు తీస్తూ సురక్షితంగా ఎలా ఉండగలిగారు? వర్మ: చిన్నప్పట్నుంచీ నాకది వెన్నతో పెట్టిన విద్య. వాళ్లు నన్ను బెదిరిస్తుంటారు. నేను వాళ్లని బెదిరిస్తుంటాను. నాకు ఎంతమంది అండర్‌వరల్డ్ వాళ్లు తెలుసో, అంతమంది పోలీసులు కూడా తెలుసు. రియల్ మాఫియా డాన్ని ఎవరినైనా కలిశారా? వర్మ: నో కామెంట్. మీకు చాలామంది శిష్యులున్నారు కదా. వాళ్లల్లో ది బెస్ట్ ఎవరనుకుంటారు? వర్మ: నాకు తెలిసి శిష్యులనేవారు ఎవ్వరూ ఉండరు. గురువు అనే కాన్సెప్ట్‌ని నమ్మను. నేనెవ్వరికీ ఏమీ నేర్పలేదు. మరి నన్ను గురువు అని అంటే, నా ఉద్దేశంలో అది ఇన్సల్టే అవుతుంది. ఎవరి దగ్గరనుంచైనా ఏం చేయకూడదో నేర్చుకోవాలి గానీ, ఏం చేయాలో నేర్చుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే ఇండివిడ్యువాలిటీ ఉండదు. ఒకర్ని ఫాలో అవ్వడమంటే గొర్రె కింద లెక్క. స్త్రీ అంటే మీ దృష్టిలో? వర్మ: నాకు దేవుడి మీద చాలా కంప్లయింట్స్ ఉన్నాయి. కేవలం స్త్రీని సృష్టించాడన్న ఒకే ఒక్క కారణం మీద దేవుణ్ణి క్షమించేశాను. ప్రేమంటే? వర్మ: అది ఒక డ్రగ్లాంటిది. తీసుకునేటపుడు హైలో ఉంటుంది. తర్వాత లో అయిపోతుంది. దాన్ని అదే హైలెవెల్లో సస్టెయిన్ చేయాలంటే అమ్మాయి, అబ్బాయిలో హెవీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అది 99 శాతం మందికి ఉండదనేది నా ఫీలింగ్. 99 శాతం ప్రేమలు బయట ఫెయిలవ్వడానికి కారణం అదే. కేవలం సినిమాల్లోనే ప్రేమలు హిట్టవుతాయి. మీరెప్పుడూ ఆ లవ్ డ్రగ్‌కి ఎడిక్ట్ కాలేదా? వర్మ: నేను చాలాసార్లు అయ్యాను. ఇప్పటికీ అవుతూనే ఉంటాను. హీరోయిన్ ఊర్మిళ ఎక్కడున్నారు? వర్మ: ముంబైలో ఉంది. తను మీతో టచ్‌లో ఉందా? తను సినిమాల్లో యాక్ట్ చేస్తుందా? వర్మ: నాకు తెలియదు. ‘నిశ్శబ్ద్’ సినిమాతో మీరు పరిచయం చేసిన కథానాయిక జియాఖాన్ ఆత్మహత్య వార్త తెలిసినపుడు ఎలా రియాక్టయ్యారు? వర్మ: ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తను నాకు బాగా క్లోజ్. 20 ఏళ్ల అమ్మాయి ఏ కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకున్నా కూడా, అది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది. వృద్ధాప్యంలో మీరెలా ఉంటారో ఎప్పుడైనా ఊహించుకున్నారా? వర్మ: చెప్పానుగా... నాకు నచ్చనివి నేనెప్పుడూ ఊహించుకోను. నేనెప్పుడూ ఇలా సూపర్‌మేన్‌లాగా ఉంటాననేది నా కల. నన్నిలా నా కలల ప్రపంచంలో బతకనివ్వండి. ఓకేనా... -పులగం చిన్నారాయణ మీ లైఫ్‌స్టయిల్ ఎలా ఉంటుంది? వర్మ: నాకు నైట్ లైఫ్ ఎక్కువ. ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం ఆరున్నర, ఏడు గంటలకల్లా నిద్రలేస్తాను. నేను రోజుకి 3, 4 గంటలు మించి నిద్రపోను. నిద్ర లేచాక కచ్చితంగా ఒక సినిమా చూస్తాను. సినిమా పూర్తయ్యాక జిమ్ చేస్తా. నాకు టోటల్‌గా సినిమానే ప్రపంచం. నో ఫ్రెండ్స్. ఎవ్వరి ఇంటికీ భోజనానికి వెళ్లను. బంధువుల ఇంటికీ వెళ్లను. గుడికి వెళ్లి 30, 40 ఏళ్లు అయ్యుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ బలవంతం మీద ఒకసారి గుడికి వెళ్లాను. మా ఇంట్లో దేవుడు కూడా ఉండడు. పుస్తకాలు, సినిమాలూ అంతే! ముంబైలో నా ఫ్లాట్‌లో గెస్ట్ రూమ్ కూడా ఉండదు. పడుకుంటే నా బెడ్ మీదే పడుకోవాలి. లేకపోతే పడుకోకూడదు. మరి ఫుడ్? వర్మ: ఫుడ్ అస్సలు ఇంట్రస్ట్ ఉండదు. ఆకలి అనే ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి ఏదో తింటానంతే. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యత ఇస్తారనుకుంటాను? వర్మ: ఫిజికల్ ఫిట్నెస్ అనేది నూటికి నూరుశాతం మనల్ని అలర్ట్‌గా ఉంచడానికి, లేజీనెస్ తీసేయడానికి, మెంటల్ ఎనర్జీకి ఉపకరిస్తుందని నా ఫీలింగ్. ఎగ్జైట్మెంట్ లెవెల్స్ అనేవి వెరీమచ్ క్లోజ్ టు ఫిజికల్ ఫిట్నెస్. మీరు కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డరా? వర్మ: బెల్ట్ ఏమీ లేదు కానీ, నేనొక మంచి ఫైటర్ననే అపోహ మాత్రం చాలామందికి కలిగించేవాణ్ణి. స్పోర్ట్స్ ఇంట్రస్టేనా? వర్మ: ఎప్పుడూ ఆడలేదు. ఒక్క దాగుడు మూతలు మాత్రం చిన్నప్పుడు ఆడేవాణ్ణి. క్రికెట్ అంటే బాగా చిరాకు. ఎందుకంటే హైస్కూల్లో ఉన్నప్పుడు ఓసారి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మోకాలికి తగిలి రెండు రోజులు బాధపడ్డాను. అప్పటినుంచీ క్రికెట్ వదిలేశాను. ************************ ‘సిటిజన్ కేన్’ కన్నా ‘అడవిరాముడు’ 100 రెట్లు బెటర్! ‘సిటిజన్ కేన్’ నాకు బోర్ కొట్టింది. ‘అడవిరాముడు’ మాత్రం 17 సార్లు చూశాను. ఎప్పుడు చూసినా నాకు బోర్ కొట్టలేదు. నేను సివిల్ ఇంజినీరింగ్ చదువులో చాలా బ్యాడ్. దాదాపుగా కాపీ కొట్టి, లెక్చరర్లను కాకాపట్టి అత్తెసరు మార్కులతో పాసయ్యాను. కృష్టా ఒబెరాయ్ నిర్మాణ దశలో సైట్ ఇంజినీర్‌గా నెలకు 800 రూపాయలకు జాబ్ చేశాను. మహా అయితే ఇన్నేళ్లకో ప్రమోషన్ వచ్చి ఉండేదేమో. అంత బ్యాడ్ ఇంజినీర్ని. నేను చిన్నతనంలో జానపదాలు బాగా చూసేవాణ్ణి. ‘అగ్గి మీద గుగ్గిలం’ వంటి సినిమాలకు బాగా ఎట్రాక్ట్ అయ్యేవాణ్ణి. ఒకప్పడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇరానీ కేఫ్‌లు కనిపించేవి. ఇప్పుడంతా కాఫీ షాపులు, పబ్లమయం. చాలా షాకింగ్‌గానే ఉంది. ఒకప్పుడు నేను తిరిగిన ప్లేసులు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. కల్చర్, మనుషులు, డ్రెస్‌సెన్స్, ఆలోచనా విధానం మొత్తం మారిపోయింది. నాకు తెలిసిన హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఒకటి కాదేమో అన్నట్టుగా మారిపోయింది. నేను త్వరలో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నాను. బ్లాక్ బెల్ట్ హోల్డర్ అమ్మాయిని ఎంపిక చేశాను కూడా. నేను బ్రూస్లీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. అప్పట్నుంచీ అలాంటి సినిమా చేయాలని ఉండేది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా చేద్దామనుకున్నా. కానీ దానికి చాలా టైమ్ పడుతుంది. ఒకటి, రెండేళ్లు ఇక్కడ అన్నీ ఆపేసి అక్కడకు వెళ్లి పనిచేయాలి. ఆ టెంపర్మెంట్ ప్రస్తుతానికి లేదు. నేనింతవరకు ప్యూర్ లవ్ స్టోరీ చేయలేదు. ఇప్పుడిప్పుడే చేయాలనిపిస్తోంది. త్వరలో చేస్తాను. రామ్‌గోపాల్ వర్మ, డాటరాఫ్ వర్మ అంటూ నా పేరును టైటిల్స్‌గా వాడుకుని కొంతమంది సినిమాలు చేస్తున్నారు. దానిమీద నాకేం కోపంగా లేదు. ఎవరిష్టం వారిది. అసలు వాళ్లెందుకు చేస్తున్నారో నాకైతే తెలీదు. ఒకసారి ఆ సినిమాల ట్రయలర్స్ చూసి వాళ్లకు నా గురించి అర్థమైంది ఇంతేనా అనిపించింది. -
సత్య 2 ఆడియో విడుదల హైలెట్స్
-
RGV సత్య ఉపదేశం
-
నేను ఏ క్రిమినల్‌తో ఒక్కరోజూ డిన్నర్ చేయలేదు - రామ్‌గోపాల్‌వర్మ
‘‘ఇందులో నేను ఓ ప్రేమ గీతం పాడాను. దానికి కారణం ఒక్కటే. నాకు ప్రేమగీతం పాడాలని ఓ చిన్న కోరిక ఉంది. అది తీర్చుకోవడానికి పాడాను’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం ‘సత్య-2’. శర్వానంద్ ఇందులో ప్రధాన పాత్రధారి. నితిన్ రైక్వార్, సంజయ్, దర్శన్, శ్రీ ఇషాక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియోసీడీని బోయపాటి శ్రీను, రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని పూరి జగన్నాథ్‌కి అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘‘సత్య’కి ‘సత్య-2’కి చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటారు. ఆ ఆలోచనకు సరైన రూపమే ‘సత్య-2’. శర్వానంద్ నేనేదో అవకాశమిచ్చినట్లు మాట్లాడాడు. నేను అవకాశాలివ్వను... తీసుకుంటాను. క్రిమినల్స్‌తో పరిచయం ఉండటం వల్లే ఇలాంటి సినిమాలు ఇంత రియలిస్టిక్‌గా తీయగలుగున్నానని చాలా మంది అభిప్రాయం. నిజానికి నేను ఏ క్రిమినల్‌తో ఒక్క రోజు కూడా డిన్నర్ చేయలేదు. నిజజీవితంలో జరిగే అనుభవాలే నా సినిమాల్లో కనిపిస్తాయి’’అని చెప్పారు. ఇంకా పూరిజగన్నాథ్, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, ఆర్పీ పట్నాయక్, కోన వెంకట్, సందీప్ కిషన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఐజీ సీతారామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సత్య - 2 ఆడియో విడుదల వేడుక
-
‘బ్రూస్లీ’ టైటిల్‌తో రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. రకరకాల కాన్సెప్ట్‌లతో చిత్రవిచిత్రమైన టైటిల్స్‌తో ఏకధాటిగా సినిమాలు చేయడం ఆయనకే చేతనవునేమో! ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘సత్య-2’ చేస్తోన్న వర్మ, మరో పక్క ‘బ్రూస్లీ’ టైటిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఇదేదో హీరోతో యాక్షన్ సినిమా అనుకునేరు. పక్కా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అట. హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు? అనేది త్వరలోనే వెల్లడి స్తారట. అలాగే తనకిష్టమైన హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో మరో చిత్రం చేయడానికి వర్మ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం ‘పట్ట పగలు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట. 30 రోజుల్లోనే ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారట వర్మ. -
వర్మ సినిమా ఆడియా ఫంక్షన్ కు రోశయ్య
నాందాండ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ రోశయ్యను నిర్మాత దేవిశ్రీదేవి సతీష్ ఆహ్వానించారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం నాందాండ. హిందీలో వచ్చిన సత్య సినిమాకు ఇది సీక్వెల్. హిందీ, తెలుగు, తమిళ భాషాల్లో ఇది తెరకెక్కుతోంది. తమిళ వెర్షన్ ను సతీష్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై దేవిశ్రీదేవి సతీష్ నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబయి ముద్దుగుమ్మలు అనైక, అనీషా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో సురేష్, తలైవాస్ విజయ్ కనిపించనున్నారు. కథేంటి రామ్‌గోపాల్ వర్మ చిత్రాలు ఇలా ఉంటాయని ఊహించడం కష్టం. ఆయన దర్శకశైలి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వైవిధ్యభరిత కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో వర్మది అందెవేసిన చేయి. అలాంటి దర్శకుడు ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం నాందాండా అని నిర్మాత సతీష్ పేర్కొన్నారు. ఆయన చిత్రీకరణ ఎంత వేగంగా ఉంటుందో అంత అద్భుతం గా ఉంటుందని తెలిపారు. రౌడీలకు రౌడీగా మారితే జరిగే పరిణామాలేమిటన్నది నాందాండా చిత్ర కథ అని చెప్పారు. శరవేగంగా నిర్మాణం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని సతీష్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ తుది షెడ్యూల్ ఈ నెల 13 నుంచి చెన్నైలో జరగనుందని తెలిపారు. మరోపక్క డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెలలోనే ఆడియో ఈ నెలలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ రోశయ్యను ఆహ్వానించినట్లు వెల్లడించారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ట్రైలర్‌కు కలైపులి థాను వాయిస్ ఓవర్ నాందాండ ఉత్తర చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమని సతీష్ వివరించారు. చిత్ర సంభాషణలు ఆ ప్రాంత యాసలోనే ఉంటాయని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని భావించానన్నారు. అందువలనే ఉత్తర మద్రాసులో పుట్టిన పెరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థానుతో ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించామని తెలిపారు. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను తొలిసారిగా వాయిస్ ఓవర్ ఇస్తున్న చిత్రం నాందాండా కావడం విశేషం.