జూన్‌ 22న ‘దమ్ముంటే సొమ్మేరా’

Santhanam Starrer Dammunte Sommera Release Date - Sakshi

కోలీవుడ్ కామెడీ స్టార్‌ సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాంబాల ద‌ర్శక‌త్వంలో  రూపొందిన  సినిమా ‘దిల్లుడు దుడ్డు’. తమిళనాట ఘనవిజయం సాదించిన ఈ సినిమాను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై న‌ట‌రాజ్  ‘ద‌మ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్బంగా చిత్రయూనిట్‌ మాట్లాడుతూ, ‘త‌మిళంలో తేండాల్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది.  అక్కడ పెద్ద విజ‌యాన్ని సాధించింది. తెలుగులో ‘ద‌మ్ముంటే సొమ్మేరా’ టైటిల్ తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా  బ్యాన‌ర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈనెల 22న దాదాపు 200 ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు అంతా త‌ప్పకుండా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా’ అన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top