breaking news
Dammunte Sommera
-
‘దమ్ముంటే సొమ్మేరా’ మూవీ రివ్యూ
టైటిల్ : దమ్ముంటే సొమ్మేరా జానర్ : హర్రర్ కామెడీ తారాగణం : సంతానం, అంచల్ సింగ్, ఆనంద్ రాజ్, సౌరభ్ శుక్లా, రాజేంద్రన్ సంగీతం : తమన్ నేపథ్య సంగీతం : కార్తీక్ రాజా దర్శకత్వం : రామ్ బాలా నిర్మాత : నటరాజ్ సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమా ఫార్ములా కామెడీ హర్రర్. ఈ జానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. ఒక దశలో అన్నీ ఇదే తరహా సినిమాలు రావటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు. దీంతో వెండితెర మీద హర్రర్ కామెడీల జోరుకు బ్రేక్ పడింది. కొంత గ్యాప్ తరువాత మరో సారి అదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా దమ్ముంటే సొమ్మేరా. కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం హీరోగా తెరకెక్కిన దిల్లుకు దుడ్డు సినిమాను దమ్ముంటే సొమ్మేరా పేరుతో తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్‌గా పరిచయం అయిన సంతానం, హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? హర్రర్ కామెడీ జానర్ మరోసారి సక్సెస్ ఫార్ములాగా ప్రూవ్ చేసుకుందా..? కథ : కుమార్ (సంతానం), కాజల్ (అంచల్ సింగ్) స్కూల్ ఫ్రెండ్స్. చిన్న వయసులోనే కాజల్‌కు కుమార్ అంటే ఇష్టం కలుగుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ కాజల్ తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపించటంతో ఇద్దరు దూరమవుతారు. చాలా ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన కాజల్.. కుమార్ కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ గొడవ కారణంగా కలుసుకున్న కుమార్, కాజల్‌లు గతం తెలుసుకొని ప్రేమలో పడతారు. కానీ కాజల్ తండ్రి సేట్ (సౌరబ్ శుక్లా) వారి ప్రేమను అంగీకరించడు. ఎలాగైనా కుమార్ అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ మణి (రాజేంద్రన్)తో కలిసి కుమార్‌ను చంపేందుకు ప్లాన్ చేస్తాడు. సిటీలో చంపితే అందరికీ అనుమానం వస్తుందని నగరానికి దూరంగా శివగంగ పర్వతం మీద ఉన్న పాత బంగ్లాకు తీసుకెళ్లి చంపాలని నిర్ణయించుకుంటారు. కాజల్, కుమార్‌లకు పెళ్లి చేస్తానని అబద్ధం చెప్పి రెండు కుటుంబాలను దెయ్యాల బంగ్లాకు తీసుకెళతాడు. అలా బంగ్లాలోకి వెళ్లిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు..? ఆ బంగ్లా కథ ఏంటి..? దెయ్యాల భారీ నుంచి వారిని ఎవరు కాపాడారు..? చివరకు కాజల్, కుమార్‌లు ఎలా ఒక్కటయ్యారు..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : తెలుగు తెర మీద హర్రర్ కామెడీ సినిమాలు చాలానే వచ్చాయి. దమ్ముంటే సొమ్మేరా కూడా దాదాపు అదే తరహాలో సాగుతుంది. కథ పరంగా కొత్తదనమేమీ లేకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాప్ కాస్త నెమ్మదిగా సాగినా.. కథ బంగ్లాలోకి ఎంటర్ అయిన తరువాత కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. (సాక్షి రివ్యూస్) హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్‌లో సో సోగా అనిపించినా.. కామెడీ సీన్స్ లో మాత్రం సంతానం కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్‌తో తన మార్క్ చూపించాడు. హీరోయిన్గా పరిచయం అయిన అంచల్ సింగ్ ఆకట్టుకుంది. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించింది. కామెడీ హర్రర్ జానర్ కావటంతో ప్రతీ పాత్రలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందుకు తగ్గట్టుగా హీరో తండ్రి పాత్రలో ఆనంద్ రాజ్, హీరోయిన్ తండ్రిగా సౌరభ్ శుక్లా, కాంట్రక్ట్ కిల్లర్ గా రాజేంద్రన్ తమ పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండ్ హాప్లో వచ్చే రాజేంద్రన్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. తమన్ సంగీతమందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కార్తీక్ రాజా అందించిన నేపథ్య సంగీతం హర్రర్ సినిమాకు కావాల్సిన ఎఫెక్ట్ తీసుకువచ్చింది. హర్రర్ చిత్రాలకు సినిమాటోగ్రఫి ఎంతో కీలకం. దీపక్ కుమార్ తన విజువల్స్‌తో ఆడియన్స్‌ను భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు. (సాక్షి రివ్యూస్) ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తొలి భాగం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ నేపథ్య సంగీతం సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
జూన్ 22న ‘దమ్ముంటే సొమ్మేరా’
కోలీవుడ్ కామెడీ స్టార్ సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దిల్లుడు దుడ్డు’. తమిళనాట ఘనవిజయం సాదించిన ఈ సినిమాను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ, ‘తమిళంలో తేండాల్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది. అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్ తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈనెల 22న దాదాపు 200 ధియేటర్లలో రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు అంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు.