కౌంట్‌డౌన్ స్టార్ట్!

కౌంట్‌డౌన్ స్టార్ట్!


 సంక్రాంతి బాక్సాఫీస్ పందెంలో దూసుకు రానున్న ‘డిక్టేటర్’ కోసం అభిమానులు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం గుమ్మడికాయ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. షూటింగ్ అనుకున్న విధంగా జరగడంతో కేక్ కట్ చేసి, సందడి చేశారు. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ‘‘అభిమానులు బాలకృష్ణను ఎంత స్టయిలిష్‌గా చూడాలని కోరుకుంటారో, ఈ చిత్రంలో అలానే కనిపిస్తారు’’ అని దర్శక-నిర్మాత శ్రీవాస్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కథ-స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సహ-నిర్మాత: శ్రీవాస్.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top