చివరి సీన్లలో ఆయన నటిస్తే బాగుండేది | Sanjay Dutt Should Have Played Last Portions In His Biopic Said By Salman | Sakshi
Sakshi News home page

చివరి సీన్లలో ఆయన నటిస్తే బాగుండేది

Jun 6 2018 4:51 PM | Updated on Jun 6 2018 4:52 PM

Sanjay Dutt Should Have Played Last Portions In His Biopic Said By Salman - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌(పాత చిత్రం)

ముంబాయి: సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ఆధారంగా నిర్మించిన తాజా చిత్రం ‘సంజు’  ట్రైలర్‌ను బాలీవుడ్‌కండల నటుడు సల్మాన్‌ఖాన్‌ బుధవారం వీక్షించారు. ఈ చిత్రం గురించి సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ..క్లైమాక్స్‌ సన్నివేశాల్లో సంజయ్‌ దత్‌ స్వయంగా నటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజు హిర్వాణీ చాలా సెన్సిబుల్‌ డైరెక్టర్‌ అని, ఆయన తనదైన శైలిలో చిత్రాలు తీస్తుంటాడని అన్నారు.

సల్మాన్‌ ఖాన్‌ బయోపిక్‌ భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉందా అని ఇంటర్వూలో ప్రశ్నించగా..తన బయోపిక్‌ తీసే ఉద్దేశం తనకు లేదని, అలాంటి పని తాను చేయనని చెప్పారు. ఒకవేళ తీసే ఉద్దేశం  ఉంటే తానే బహిరంగా చెబుతానని వ్యాఖ్యానించారు. సల్మాన్‌ ఖాన్‌(52) తాజాగా నటించిన రేస్‌3 చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. సంజు సినిమాలో సంజయ్‌ దత్‌ పాత్రలో రణబీర్‌ కపూర్‌ నటించిన సంగతి తెల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement