సిక్సర్‌

Samantha wraps up shoot for her Telugu-Tamil bilingual U Turn - Sakshi

రయ్‌ రయ్‌ మంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు సమంత. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనే చెప్పవచ్చు. ఆల్రెడీ ‘రంగస్థలం’, ‘మహానటి’(తమిళంలో ‘నడిగయర్‌ తిలగం’), ‘ఇరంబుదురై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమాలతో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ‘యు టర్న్‌’ సినిమాలో తన షూటింగ్‌ను కంప్లీట్‌ చేశారు. పవన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్‌ రవీంద్రన్‌ కూడా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత.  ‘‘ఇంకో సినిమా (యు టర్న్‌) షూటింగ్‌ను కంప్లీట్‌ చేశా. ఇక డబ్బింగ్‌ స్టార్ట్‌ చేయాలి’’ అన్నారు సమంత.

ఈ సినిమాకు సోమవారం నుంచి సమంత డబ్బింగ్‌ చెప్పనున్నారు. తమిళంలో శివకార్తీకేయన్‌ హీరోగా ‘సీమరాజా’, విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలను కూడా కంప్లీట్‌ చేశారు సమంత. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానున్నాయి. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమయ్యాయన్నది పక్కన పెడితే ఈ ఏడాది ఇప్పటి వరకూ సమంత అరడజను సినిమాల షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి సిక్సర్‌ కొట్టారు. ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య ఓ సినిమా చేయనున్నారు. సో.. ఈ సినిమానే సమంత నెక్ట్స్‌ చిత్రం అని ఊహిస్తున్నారు సినీ లవర్స్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top