అందమైన దెయ్యాన్ని చూశారా!? | samantha devil role on raju gari gadi-2 | Sakshi
Sakshi News home page

అందమైన దెయ్యాన్ని చూశారా!?

Sep 3 2017 12:25 AM | Updated on Jul 15 2019 9:21 PM

∙‘రాజుగారి గది–2’లో సమంత - Sakshi

∙‘రాజుగారి గది–2’లో సమంత

ఏంటి... మీరు ఇంకా చూడలేదా? అయితే త్వరగా ఇన్‌సెట్‌ ఫొటోపై ఓ లుక్కేయండి.

ఏంటి... మీరు ఇంకా చూడలేదా? అయితే త్వరగా ఇన్‌సెట్‌ ఫొటోపై ఓ లుక్కేయండి. అందులో ఉన్నది దెయ్యమే. సమంతను దెయ్యం అనేస్తున్నారేంటి? అనొద్దు. ఎందుకంటే... నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజుగారి గది–2’లో ఆమె దెయ్యంగానే నటిస్తున్నారు మరి. ఈ దెయ్యం భలే అందంగా ఉంది కదూ! శుక్రవారంతో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేశారు. సిన్మాలో చాలా ఆసక్తికరమైన పాత్ర పోషించానని ఈ ఫొటోను ట్వీట్‌ చేశారు. ఈ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది.

పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్‌ పూర్తయినట్లే. మరో రెండు మూడు రోజులు మాత్రమే బ్యాలెన్స్‌ ఉందట! ఆల్రెడీ డబ్బింగ్‌ వర్క్‌ మొదలైంది. ‘‘ఓంకార్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. డబ్బింగ్‌ చెబుతున్నాను కదా! సినిమా బాగా వచ్చింది. మరో పది రోజుల్లో ఫస్ట్‌ కాపీ రెడీ అవుతుంది’’ అన్నారు నాగార్జున. ఇందులో ఆయనది మెంటలిస్ట్‌ పాత్ర. దెయ్యానికి, మెంటలిస్ట్‌కి మధ్య జరిగే డ్రామాయే సినిమా. సీరత్‌ కపూర్, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement