సల్మాన్‌... 52 ఏళ్ల వయస్సులోనూ..

Salman Khan Accepts Fitness Challenge - Sakshi

భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ ప్రారంభించిన ‘ఫిట్‌నెస్‌ చాలెంజ్‌’ ‌ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుని వరకు చాలా మంది ఈ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ని స్వీకరించి తమ వీడియోలను షేర్‌ చేశారు. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ అంటూ పిలుపునిచ్చారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా చేరాడు.

కేంద్ర సహాయక మంత్రి కిరణ్‌ రిజిజు విసిరిన చాలెంజ్‌కు స్పందనగా.. ‘క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ ప్రారంభించిన గొప్ప కార్యక్రమం ఇది. కిరణ్‌ రిజిజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా’  అంటూ తన వర్కౌట్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకు ఫిదా అయిన సల్మాన్ అభిమానులు.. 52 ఏళ్ల వయస్సులోనూ తమ హీరో ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే చాలు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి. కాగా ప్రస్తుతం ‘భారత్‌’  సినిమా షూటింగ్‌ నిమిత్తం సల్లూ భాయ్‌ ‘మాల్టా’కు చేరుకున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top