
అనుకున్న సమయానికి అల్లుడు రావడం లేదు. ఎప్పుడు వస్తాడనే విషయాన్ని త్వరలో చెబుతా అంటున్నాడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కేరళలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండటంతో విడుదల వాయిదా వేశారు.
‘‘కేరళలోని దురదృష్టకర పరిస్థితుల వల్ల సినిమా రీ–రికార్డింగ్ వర్క్‌ని సరైన సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త విడుదల తేదీని నిర్మాతలు త్వరలో ప్రకటిస్తారు. అలాగే కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వీలైనంత సాయం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగచైతన్య.