బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో | Sachin joshi files cheating case on bandla ganesh | Sakshi
Sakshi News home page

బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

Jun 18 2015 11:19 AM | Updated on Sep 3 2017 3:57 AM

బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

బండ్ల గణేష్పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది.

హైదరాబాద్ :  ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది.  'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపింది. హీరో సచిన్ జోషి...వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 'ఆషికి 2'  చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే  నీ జ‌త‌గా నేనుండాలి సినిమాకీ గ‌ణేష్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గ‌ణేష్ త‌న‌ని మోసం చేశాడ‌ని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని  వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తాన‌ని చెప్పి... చివ‌రికి న‌ష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ త‌ప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement