బాహుబలి క్లైమాక్స్‌కు 30 కోట్ల వ్యయం? | rs 30 crores being spent for the climax shooting of baahubali the conclusion | Sakshi
Sakshi News home page

బాహుబలి క్లైమాక్స్‌కు 30 కోట్ల వ్యయం?

Jun 11 2016 6:47 PM | Updated on Sep 4 2017 2:15 AM

బాహుబలి క్లైమాక్స్‌కు 30 కోట్ల వ్యయం?

బాహుబలి క్లైమాక్స్‌కు 30 కోట్ల వ్యయం?

భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలి రెండో భాగం.. బాహుబలి ద కన్‌క్లూజన్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే.

భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన బాహుబలి రెండో భాగం.. బాహుబలి ద కన్‌క్లూజన్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం బాగోకపోవడం.. వేడి చాలా ఎక్కువగా ఉండటంతో కొన్నాళ్ల పాటు షూటింగుకు బ్రేక్ ఇచ్చిన జక్కన్న.. ఇటీవలే మళ్లీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ఈ సినిమా క్లైమాక్సు ఒక్కదానికే దాదాపు రూ. 30 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి తొలి భాగంలో కూడా క్లైమాక్స్ సీన్ కీలకం కావడంతో.. ఆ షూటింగుకు రూ. 10 కోట్లు వెచ్చించారు. మొదటి భాగానికి దాదాపు రూ. 600 కోట్ల వరకు వసూలైంది. భారీ అంచనాలు ఉండటంతో రెండో భాగం బడ్జెట్ కూడా బాగా పెరుగుతోందని అంటున్నారు. 2017లో విడుదల కావాల్సిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement