చిన్న గ్యాప్‌ తర్వాత...

RRR team waiting for SS Rajamouli is London to return - Sakshi

ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా స్క్రీనింగ్‌ కోసం గతవారం లండన్‌లో గడిపారు దర్శకులు రాజమౌళి. ఈ కార్యక్రమం వల్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణకు చిన్న అంతరాయం ఏర్పడింది. లండన్‌ నుంచి రాజమౌళి తిరిగి రావడంతో  మళ్లీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది.

1920 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top