‘ఆర్‌ఆర్‌ఆర్’‌ ట్రయిల్‌ షూట్‌ రద్దు.. అందుకేనా! | RRR Movie Trail Shoot Cancel Due To Corona Cases Spike In HYD | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ ట్రయిల్‌ షూట్‌ రద్దు.. కారణం ఇదేనా!

Jun 18 2020 6:34 PM | Updated on Jun 18 2020 6:58 PM

RRR Movie Trail Shoot Cancel Due To Corona Cases Spike In HYD - Sakshi

ప్రజా జీవనాన్ని కరోనా వైరస్‌ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసింది. వైరస్‌ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో అన్ని సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమల్లోనూ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ ‌(రౌద్రం రణం రుధిరం) చిత్ర షూటింగ్‌కు కూడా బ్రేక్‌ పడింది. కాగా ఇటీవల షూటింగ్‌లకు ప్రభుత్వం షరతులతో కూడిన సడలింపులు ఇవ్వడంతో టెలివిజన్‌ సీరియళ్లు, కొన్ని సినిమాలు తిరిగి షూటింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రయిల్‌ షూట్‌ ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ భావించారు. దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో 2 రోజుల ట్రయిల్‌ షూట్ మొదలు పెట్టేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు. (‘రాజ్‌ కపూర్‌ తర్వాత ప్రభాస్‌కే’)

50 శాతం సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ కేసులు అధికంగా నమోదవుతుండటం వల్ల ట్రయిల్‌ షూట్‌ రద్ధు అయినట్లు తెలుస్తోంది. వైరస్‌ కారణంగా పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రస్తుతం దీనిని కూడా నిలిపివేయాలని బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్‌ పూర్తిచేసుకోగా మిగతా 30 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉంది. (పరిస్థితులకు తగ్గట్టు మసలుకోవాలి: చెర్రీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement