విశాల్‌ ఫస్ట్‌లుక్‌.. చెలరేగిన వివాదం! | Row On Vishal Ayogya First look | Sakshi
Sakshi News home page

Nov 20 2018 5:17 PM | Updated on Nov 20 2018 9:07 PM

Row On Vishal Ayogya First look - Sakshi

బీరు బాటిల్ పట్టుకుని ఉన్న విశాల్ కొత్త సినిమా పోస్టర్ పై తమిళనాట వివాదం రాజుకుంటోంది. తెలుగులో హిట్గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విశాల్ పోలీసు జీపుపై బీరుబాటిల్ పట్టుకుని కూర్చున్న సన్నివేశం ఉంది. ఇదే ఇప్పుడు తమిళుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది.

బాధ్యతాయుత పదవుల్లో ఉండటమే కాకుండా సమాజానికి మంచి చెప్పే హీరో ఇటువంటి సన్నివేశాల్లో నటించటం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రధానంగా మద్యపానంపై పోరాడుతున్న పిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్ విశాల్ పై విరుచుకు పడ్డారు. గతంలో సినిమాల్లో తారలు పొగతాగటంపై రాద్దాంతం చేసి ఓ మేరకు విజయం సాధించారు రాందాస్. ఇప్పుడు మద్యం విషయంలో విశాల్‌పై మండిపడుతున్నారు. అయితే ఈ వివాదం ఎక్కడికి వెళుతుందోనని తమిళ చిత్రసీమ ఆందోళనలో ఉంది. మరి దీనిపై విశాల్ సమాధానం ఎలా ఉంటుందో వెయిట్ అంట్ సీ అని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాట సినిమాల్లో సిగరెట్ తాగటంపై రాజకీయ నేతల విమర్శలకు ఏకంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి హీరోలే తమ సినిమాల్లో అలాంటి సన్నివేశాలను తొలగించటంతో పాటు ఇకపై తమ సినిమాల్లో అటువంటివి ఉండబోవని ప్రకటించి ఆచరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement