మరో బిడ్డకు జన్మనిచ్చిన హ..హ..హాసిని | Riteish Deshmukh and Genelia Deshmukh Blessed with Baby boy | Sakshi
Sakshi News home page

మరో బిడ్డకు జన్మనిచ్చిన హ..హ..హాసిని

Jun 1 2016 11:32 AM | Updated on Sep 4 2017 1:25 AM

హ హ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరపించిన జెనీలియా రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే...

హ హ హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరపించిన జెనీలియా రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె భర్త, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ వెల్లడించాడు. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే  నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. అందుకే తన పెద్ద కొడుకు చెపుతున్నట్టుగా, ' మా అమ్మ నాన్నలు నాకు చిన్ని తమ్ముణ్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక నాబొమ్మలన్ని తనవే' అంటూ రియాన్ ఫోటోతో కలిపి ట్వీట్ చేశాడు రితేష్.

హిందీ, తెలుగు, తమిళ సినిమాలో నటించిన జెనీలియా, రితేష్తో వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో యాక్టివ్గా ఫోటోలు పోస్ట్ చేస్తున్న జెనీలియా, 'మా అర్హత కన్నా ఎక్కువగా ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖల నుంచి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement