నా బొమ్మలన్నీ తనవే! | Riteish and Genelia blessed with a baby boy! | Sakshi
Sakshi News home page

నా బొమ్మలన్నీ తనవే!

Jun 1 2016 10:27 PM | Updated on Aug 25 2018 6:37 PM

నా బొమ్మలన్నీ తనవే! - Sakshi

నా బొమ్మలన్నీ తనవే!

‘‘మా అమ్మానాన్న నాకో తమ్ముణ్ణి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నా బొమ్మలన్నీ తనవే’’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రియాన్.

 ‘‘మా అమ్మానాన్న నాకో తమ్ముణ్ణి బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు నా బొమ్మలన్నీ తనవే’’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు రియాన్. జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్‌ల ముద్దుల కొడుకు తను. ఈ బుడతడు పుట్టి ఏడాదిన్నర్ర అయ్యింది. అప్పుడే ట్విట్టర్లో తనకు తమ్ముడు పుట్టిన విషయాన్ని ఎలా పంచుకున్నాడబ్బా? అని ఆలోచించక్కర్లేదు. రియాన్ తరఫున రితేష్ చేసిన ట్వీట్ ఇది.
 
 బుధవారం ఉదయం జెనీలియా తన రెండో కొడుక్కి జన్మనిచ్చారు. తల్లీ కొడుకు క్షేమంగా ఉన్నారు. రితేష్, జెన్నీ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లకు పైగా ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రితేష్ వంటి వ్యక్తి తనకు భర్తగా లభించడం అదృష్టం అని జెన్నీ పేర్కొన్నారు.
 
 రెండో బాబుకి జన్మనివ్వడానికి ఆస్పత్రిలో చేరే ముందు తన భర్తతో దిగిన ఒక ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి... ‘‘థ్యాంక్యూ గాడ్... నేను అనుకున్నదానికన్నా నన్ను ఎక్కువే ఆశీర్వదించావ్’’ అని పేర్కొన్నారామె. జెన్నీ, రితేష్‌ల వైవాహిక జీవితం ఎంత ఆనందంగా సాగుతోందో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement