ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు! | rendu rellu aaru This movie will be released on Saturday. | Sakshi
Sakshi News home page

ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు!

Jul 6 2017 11:38 PM | Updated on Sep 5 2017 3:22 PM

ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు!

ఇద్దరి నిర్ణయాలు.. ఆరుగురి జీవితాలు!

అనిల్‌ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రెండు రెళ్ళు ఆరు’.

అనిల్‌ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రెండు రెళ్ళు ఆరు’. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్స్‌పై ప్రదీప్‌ చంద్ర, మోహన్‌ అండె నిర్మించారు. శనివారం ఈ సినిమా విడుదల కానుంది. నందు మల్లెల మాట్లాడుతూ– ‘‘మొబైల్‌లో కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్నప్పుడు ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే కథ బాగుండాలి. అందుకే కథ బాగా రాసుకున్నా.

ఇద్దరి నిర్ణయాలతో ఆరుగురు జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయన్నదే కథ. సాయిగారు చూసిన పది నిమిషాలకే ఇంప్రెస్‌ అయ్యి, సినిమా తీసుకుంటాం అన్నారు. ఆ రోజే టీ–షర్ట్‌లు మార్చి కాలర్‌ చొక్కాలు వేసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హీరో నా బ్రదరే. క్యారెక్టర్‌కు సూట్‌ అవుతాడని ప్రొడ్యూసర్‌గారే సెలక్ట్‌ చేశారు. ఊహల్లో విహరించను. విలువలు లేకుండా సినిమాలు తీయను. నాకివ్వాలనుకునే డబ్బుల్ని సినిమాపై ఖర్చు పెట్టమని చెప్పాను. ఫ్రీడమ్‌ ఇస్తే చాలనుకున్నాను. అది లభించింది. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement