రెండు రెళ్లు నాలుగు కాదు | rendu rellu aaru film released on July 8 | Sakshi
Sakshi News home page

రెండు రెళ్లు నాలుగు కాదు

Jun 30 2017 1:00 AM | Updated on Sep 5 2017 2:46 PM

రెండు రెళ్లు నాలుగు కాదు

రెండు రెళ్లు నాలుగు కాదు

రెండు రెళ్లు ఎంత? అంటే నాలుగని సమాధానం చెబుతారెవరైనా. కానీ, రెండు రెళ్లు ఆరు అంటున్నారు ‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రబృందం.

రెండు రెళ్లు ఎంత? అంటే నాలుగని సమాధానం చెబుతారెవరైనా. కానీ, రెండు రెళ్లు ఆరు అంటున్నారు ‘రెండు రెళ్ళు ఆరు’ చిత్రబృందం. కథలో ఉన్న ట్విస్ట్‌ అదేనట. అనిల్‌ మల్లెల, మహిమా జంటగా నందు మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 8న విడుదల కానుంది.

సాయి కొర్రపాటి సమర్పణలో ప్రదీప్‌చంద్ర, మోహన్‌ అందె నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబ సభ్యులందరూ చూసేలా నందు ఈ సినిమా తీశారు. చిన్న సినిమాగా ప్రారంభమైన మా చిత్రం  సాయిగారి వల్ల పెద్ద సినిమాగా మారింది. విజయ్‌ బుల్‌గానిన్‌ స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement