అదుగో... పంది పిల్ల | Ravi Babu's piglet movie titled as Adhugo | Sakshi
Sakshi News home page

అదుగో... పంది పిల్ల

Jul 12 2016 11:43 PM | Updated on Sep 4 2017 4:42 AM

అదుగో... పంది పిల్ల

అదుగో... పంది పిల్ల

రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్‌గా మొదలుపెట్టేసి,

 రవిబాబు ఎప్పుడు సినిమా ఆరంభిస్తారో.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఎవరికీ తెలియదు. సెలైంట్‌గా మొదలుపెట్టేసి, షూటింగ్ పూర్తి చేసేస్తారు. మరో నెల, రెండు నెలల్లో విడుదల అనగా ఆ సినిమా వివరాలు బయటపెడతారు. ఇప్పుడు ఆయన పందిపిల్ల ముఖ్యపాత్రలో ఓ సినిమా చేశారు. ఇందులో అభిషేక్, నాభ ప్రధాన పాత్రధారులు.  ‘ఏనుగు’, ‘కోతి’, ‘ఈగ’లు మనల్ని అలరించాయి.
 
 వెండితెర పైన వరాహం ముఖ్యపాత్రలో కనిపించనుండటం ఇదే ప్రథమం. అందుకే టాలీవుడ్‌లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘అదుగో’ అనే టైటిల్ ఖరారు చేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మించారు.
 
  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘ఇప్పటి వరకూ ఎవరూ తీయని వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించాం. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement