అందుకే ముద్దుకు ఒప్పుకున్నా! | Ranbir Kapoor, Anushka Sharma to share seven liplocks in Bombay Velvet? | Sakshi
Sakshi News home page

అందుకే ముద్దుకు ఒప్పుకున్నా!

Mar 23 2015 11:55 PM | Updated on Sep 2 2017 11:16 PM

అందుకే ముద్దుకు ఒప్పుకున్నా!

అందుకే ముద్దుకు ఒప్పుకున్నా!

పెదవి ముద్దు సన్నివేశాలనగానే అదేదో పెద్ద విషయంలా మాట్లాడతారేంటి? ఇద్దరు ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అలాంటివి

 ‘‘పెదవి ముద్దు సన్నివేశాలనగానే అదేదో పెద్ద విషయంలా మాట్లాడతారేంటి? ఇద్దరు ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అలాంటివి ఉండవా ఏంటి? బాల్‌రాజ్, రోశీలు ప్రేమించుకున్నారు. ప్రేమ ఎక్కువై పెదవి ముద్దుదాకా వెళ్లారు. అది తప్పా?’’ అంటున్నారు అనుష్క శర్మ. ఇంతకీ బాల్‌రాజ్, రోశీలెవరు? వాళ్లని అనుష్క ఎందుకు సపోర్ట్ చేస్తున్నారనే విషయానికొస్తే.. రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా ‘బాంబే వెల్వట్’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
 
 అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల్‌రాజ్‌గా రణ్‌బీర్, రోశీగా అనుష్క నటిస్తున్నారు. ఈ రెండు పాత్రల మధ్య దాదాపు ఏడు పెదవి ముద్దు సన్నివేశాలున్నాయట. లిప్ లాక్ సీన్స్ మీకు ఇబ్బందిగా అనిపించవా? అనే ప్రశ్న అనుష్క శర్మ ముందుంచితే -‘‘కెమెరా ముందు ఉన్నది నేను కాదు.. రోశీని అనుకుంటా. రోశీకి బాల్‌రాజ్ అనే ప్రేమికుడు ఉంటే అతనితో ఎలా రొమాన్స్ చేస్తుందో ఊహించుకుని, అలా చేసేస్తా. ప్రేమలో ఉన్నవాళ్ల మధ్య తీపి కబుర్లతో పాటు తియ్యని ముద్దులు సహజం.
 
 రణ్‌బీర్‌కి  నిజజీవితంలో ప్రేయసి ఉంది. నేను కూడా ప్రేమలో ఉన్నాను కదా. అందుకే రొమాంటిక్ సీన్స్‌ని సునాయాసంగా చేసేస్తాం. పైగా, రణ్‌బీర్‌తో రొమాంటిక్ సీన్స్ అంటే నాకు ఇబ్బందిగా అనిపించదు. ఎందుకంటే, తన మనసులో లేనిపోని ఊహలు ఉండవు. ‘నటిస్తున్నాం.. అంతకు మించి ఏమీ లేదు’ అనుకుంటాడు. నేనూ అలానే అనుకుంటా. అందుకే మా కెమిస్ట్రీ బాగుంటుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement